బన్నీ సామాజిక బాధ్యతకు ప్రశంసలు

సెలబ్రెటీలు ఏదైనా విషయాన్ని చాలా ఈజీగా ఎక్కువ మందికి చేరవేయ గలరు. వారికి ఉన్న ఇమేజ్ కారణంగా ఎక్కువ మంది వారు చెప్ప విషయాన్ని వినేందుకు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. వారు మంచి చెప్తే కొద్ది మంది అయినా దాన్ని పాటించే అవకాశాలు ఉంటాయి. ఇక కొందరు సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. అల్లు అర్జున్ వంటి స్టార్‌ చాలా మందిని ఇన్ఫులెన్స్‌ చేయగలరు. అలాంటి అల్లు అర్జున్‌ సామాజిక బాధ్యతతో వ్యవహరించిన తీరు అభినందనీయం.

ఆయన తాజాగా ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఆ ఫొటోలో ఆయన ధరించిన టీషర్ట్‌ పై స్మోకింగ్‌ కిల్స్ అనే అక్షరాలు ఉన్నాయి. ధూమపానంకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఆ షర్ట్‌ నిలవడం అభినందనీయం. ఈ విషయమై అల్లు అర్జున్‌ కు ప్రశంసలు దక్కుతున్నాయి. సామాజిక బాధ్యతతో అల్లు అర్జున్‌ ఇలా షర్ట్‌ ను దరించి సిగరెట్ స్మోకింగ్‌ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మంచి పరిణామం అంటున్నారు. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ కారణంగానే కాస్త జుట్టు గడ్డం పెంచాడు. ఆ లుక్ లో ఈ టీ షర్ట్‌ ధరించిన ఫొటోను బ్లాక్‌ అండ్‌ వైట్‌ గా మార్చి ఇన్‌ స్టా లో షేర్‌ చేశాడు.