ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో సామ్?

రెబెల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చాడు. ఈ చిత్రానికి ప్రాజెక్ట్ కె టెంటేటివ్ టైటిల్ గా ఫిక్స్ చేసారు.

ఈ మినీ షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సమంత నటించబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఒక కీలకమైన పాత్ర కోసం సమంతను అడగ్గా ఆమె వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది.

అలాగే మలయాళ టాప్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో నటిస్తాడని కూడా రూమర్లు ఉన్నాయి. ఒకవేళ సమంత, పృథ్వీరాజ్ కూడా ఈ చిత్రంలో నటిస్తుంటే ప్రాజెక్ట్ కె గ్రాఫ్ మరింత పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.