2021లో మెగా ఫ్యామిలీ కి చెందిన అరడజను సినిమాలు రిలీజ్ లకు వస్తాయని అంచనా. ఆచార్య- రిపబ్లిక్ -గని- పుష్ప సహా ఇతర మెగా హీరోల సినిమాలు రిలీజ్ లకు రానున్నాయి. అందువల్ల మెగా నామ సంవత్సరంగా డిక్లేర్ అయ్యే ఛాన్సుంది. అయితే ఏది మారినా అదంతా థర్డ్ వేవ్ మహిమ. కరోనా మహమ్మారీ ఇక పర్మినెంటుగా శాంతిస్తే రిలీజ్ లకు ఎలాంటి ఢోఖా ఉండదు.
2022 సన్నివేశం ఎలా ఉండనుంది? అంటే.. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాలు ఈ ఏడాదిలో రిలీజవుతాయి. ఇందులో రాధే శ్యామ్ సంక్రాంతి 2022 ఖాయమైంది. ఇంతకుముందే రిలీజ్ తేదీని ఖరారు చేశారు. ఇదే ఏడాది సమ్మర్ లో సలార్ రిలీజవుతుంది. ఆదిపురుష్ 3డి స్వాతంత్య్ర దినోత్సవం వారాంతపు విడుదల కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇవి మూడు కూడా భారీ పాన్ ఇండియా సినిమాలు. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ స్టార్ గా పాపులరైన ప్రభాస్ నటించిన సినిమాలు ఒకే ఏడాదిలో మూడు రిలీజవుతున్నాయంటే సంచలనమే.
ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. రాధేశ్యామ్ -180 కోట్లు… ఆదిపురుష్ 3డి-350కోట్లు.. సలార్ – 200 కోట్ల బడ్జెట్లతో రూపొందుతున్నాయన్న కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఒక్కొక్కటి వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద అంతే భారీ అంచనాలుంటాయి. ఇక ఒకే ఏడాదిలో ప్రభాస్ నటించిన సినిమాలన్నీ 1000 కోట్ల మినిమం బిజినెస్ చేస్తాయనుకుంటే వసూళ్లు అంతకు డబుల్ ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. శాటిలైట్ డబ్బింగ్ డిజిటల్ రైట్స్ అంటూ భారీగా వర్కవుటవుతుంది. అందుకే 2022ని రెబల్ నామ సంవత్సరంగా డిక్లేర్ చేయాల్సి ఉంటుందేమో!
బిజినెస్ ఎలా ఉంది?
ట్రేడ్ లెక్కల ప్రకారం.. ప్రభాస్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి. రాధే శ్యామ్ కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 110 కోట్ల రూపాయల వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. హిందీ- తమిళం- మలయాళం అన్నింటితో కలిపి 200 కోట్లకు దగ్గరగా ఉంటుంది. అలాగే గణనీయమైన విదేశీ ఒప్పందం కూడా ఉంటుంది. 200-250 కోట్ల మేర బిజినెస్ అంటే అసాధారణమైనది.
సలార్ బిజినెస్ పై ప్రశాంత్ నీల్ ప్రభావం అదనపు అస్సెట్ అవుతుంది. అతడు తెరకెక్కించిన కేజీఎఫ్ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ KGF -చాప్టర్ 2 అంచనాలకు అనుగుణంగా విజయం సాధిస్తే `సలార్` వ్యాపారం సుమారు 300-400 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.
ఆదిపురుష్ 3డికి ఓంరౌత్ పెద్ద ప్లస్. అతడు తెరకెక్కించిన తానాజీ 3డి సంచలన విజయం సాధించింది. అందుకే అతడు రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న ఆదిపురుష్ 3డికి బిజినెస్ హైప్ ఉంది. రాధేశ్యామ్- సలార్ విజయాలు ఆదిపురుష్ 3డి బిజినెస్ కి పెద్ద ప్లస్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. ఆదిపురుష్ అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. సక్సెస్ ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఒకదాని వెంట ఒకటిగా ఏడాది అంతా ప్రభాస్ సినిమాలు రిలీజవుతున్నాయంటే దేశంలోని అన్ని భాషల్లోనూ సందడి పీక్స్ లో ఉంటుంది. పాన్ ఇండియా స్టార్ గా అతడి ప్రభావం అలాంటిది. 1000 కోట్లు యంగ్ రెబల్ స్టార్ కి ఒక లెక్క కాదిప్పుడు. బాహుబలి -600 కోట్లు.. బాహుబలి 2 -1800 కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. ఆ రెండు సినిమాలు కలిపి 2400 కోట్ల వసూళ్లను దక్కించుకుని దేశంలోనే అతి భారీ వసూళ్ల చిత్రాల్లో టాప్ 5లో నిలిచాయి. దంగల్ తర్వాత వరల్డ్ వైడ్ బెస్ట్ సినిమాగా బాహుబలి 2 రికార్డుల్లో నిలిచింది. అందుకే ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాల వ్యాపారం.. అలాగే బిజినెస్ పైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.