మరో 20 ఏళ్లు టీఆర్ఎస్‌దే అధికారం

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది విపక్ష పార్టీలకు కడుపు మంటగా ఉన్నాయంటూ టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అంతా హాజరు అయ్యారు. రాబోయే మూడు నెలల్లో పార్టీని రాష్ట్రంలో మరింతగా పఠిష్టం చేసేందుకు ప్రయత్నాలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. జిల్లాల్లో పార్టీ ఆఫీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నాడు.

కేసీఆర్‌ మాట్లాడుతూ దళితులు సమాజంలో అట్టడుగున ఉన్నారు. వారి అభిన్యతికి దళిత బందు పతకంను తీసుకు వచ్చినట్లుగా పేర్కొన్నాడు. భవిష్యత్తులు మైనార్టీలు అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా బంధు పతకంను అమలు చేస్తానంటూ ప్రకటించారు. తెలంగాణలో రాబోయే 20 ఏళ్లు కూడా టీఆర్‌ఎస్ అధికారంలో ఉంటుంది అనే నమ్మకంను ధీమాను కేసీఆర్‌ వ్యక్తం చేశారు.