యాంకర్ రవి తన డబల్ స్టాండర్డ్స్ తో తనకు తనే సమస్యలు కొనితెచ్చుకుంటున్నాడు. మొదటినుండి చెప్పిన మాటకు చేసే దానికి సంబంధం లేకుండా ఉంటోంది రవి ప్రవర్తన. పైగా షణ్ముఖ్, సిరి, జెస్సీ వంటి కొంత వీక్ కంటెస్టెంట్స్ ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నాడు. అయితే షణ్ముఖ్, జెస్సీ, సిరిలు త్వరగానే ఇది తెలుసుకుని రవి సర్కిల్ నుండి బయటపడ్డారు, అది వేరే విషయం. నిన్నటి నామినేషన్స్ లో కూడా షణ్ముఖ్ ఇదే విషయాన్ని చెప్పి రవిని నామినేట్ చేయడం విశేషం.
ఇక రవి బిగ్ బాస్ ప్రయాణంలో ఒక మాయని మచ్చలా మిగిలిపోయేది కచ్చితంగా ప్రియా, లహరిల ఎపిసోడ్. లహరి గురించి సింగిల్ మెన్ అని ప్రియా వద్ద ప్రస్తావించి, అదే విషయాన్ని తాను చెప్పలేదని అంటూ అడ్డంగా కెమెరాలకు దొరికిపోయిన రవి అది అక్కడితో వదిలేయలేదు. తెగే దాకా లాగుతుంది అన్నది తెలీకుండా మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ ఎత్తి తనే దొరికిపోతున్నాడు.
మా అమ్మ మీద ఒట్టేసి మరీ అలా ఎలా అబద్ధం చెప్పానో నాకు తెలీలేదు ఏదో ట్రాన్స్ లో ఉన్నాను అంటూ రవి.. షణ్ముఖ్, సిరిల వద్ద మాట్లాడాడు. అలాగే నామినేషన్స్ సమయంలో ఇదే విషయాన్ని ఎత్తి కవర్ డ్రైవ్ చేసుకునే ప్రయత్నం చేసాడు. ఇక నామినేషన్స్ వేసేటప్పుడు కూడా రవి మ్యాచుర్డ్ గా ఉండట్లేదు.
కాజల్ తనను మెడ మీద కొట్టిందని కారణంతో నామినేట్ చేసాడు. నువ్వు ఫ్రెండ్లీగానే కొట్టావు కానీ అది నాకు మనసుకు తాకింది అని సిల్లీ రీజన్ తో నామినేట్ చేసాడు. వెంటనే కాజల్ అలా అయితే నువ్వు నా జుట్టు పట్టుకుని లాగావు, అవన్నీ నామినేషన్స్ లోకి తెస్తే చాలా సిల్లీగా ఉంటుంది అని గట్టి కౌంటర్ వేసింది. నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేస్తూ నువ్వు నన్నే గుంటనక్క అన్నావు అని గుమ్మిడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు చేసాడు రవి. నటరాజ్ మాస్టర్ ఎవరి పేరూ బహిరంగంగా చెప్పకపోయినా కానీ తననే అంటున్నాడని చెప్పుకుని ఆడియన్స్ దృష్టిలో కొంత డౌన్ అయ్యాడు.
ఇలా సిల్లీ రీజన్స్ తో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన రవి తనను తాను డౌన్ చేసుకుంటున్నాడు. తన తప్పుల్ని తెలుసుకుని బయటపడకపోతే కచ్చితంగా ఫైనల్స్ కంటే ముందే ఎలిమినేట్ అవుతాడు.