టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించడం, సహజంగానే వైసీపీకి రుచించలేదు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మరో మంత్రి కొడాలి నాని సహా పలువురు వైసీపీ నేaతలు, జనసేనాని మీద విరుచుకుపడిపోయారు.
చంద్రబాబుకీ, పవన్ కళ్యాణ్‌కీ మధ్య రహస్య బంధం కొనసాగుతోందనీ, చంద్రబాబు మానసపుత్రుడు పవన్ కళ్యాణ్.. టీడీపీ మీద ఈగ వాలనివ్వడంలేదనీ వైసీపీ నేతలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద చంద్రబాబు హయాంలో కోడికత్తి దాడి జరిగితే, దాన్ని కూడా అప్పట్లో జనసేన అధినేత ఖండించారు.
రాజకీయ పార్టీల కార్యాలయాల మీద దాడులకు తెగబడటమే ‘నిఖార్సయిన రాజకీయం’గా భావించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి, రాజకీయాల్లో మంచి మార్పు కోసం పనిచేస్తున్న జనసేన మీద ఇంతకన్నా గొప్ప భావన వుంటుందని ఎలా అనుకోగలం.?
అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్‌ని విమర్శించాల్సిన అవసరం మంత్రులకు ఏమొచ్చింది.? చూస్తోంటే, వైసీపీ – టీడీపీ మధ్య నడుస్తున్న డ్రామాలో భాగంగానే జనసేనను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ‘నేను తిట్టినట్లు నటిస్తా.. నువ్వు కొట్టినట్లు నటించు..’ అన్నట్టుగా వైసీపీ, టీడీపీ కలిసి డ్రామా ఆడుతున్నాయన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. 2019 ఎన్నికల్లో టీడీపీ – వైసీపీ కలిసి ఆడిన రాజకీయ నాటకంలో, జనసేన ఇబ్బందులు పడింది. టీడీపీ – వైసీపీ మధ్య నడుస్తున్న 60 – 40 బంధం మరోమారు మంత్రులు, జనసేనని టార్గెట్ చేయడం ద్వారా ఇంకోసారి స్పష్టంగా బయటపడిందంతే.