పెదవి ముద్దుతో హద్దులు చెరిపేసిన సింగరాయ్

నేచురల్ స్టార్ నాని బోల్డ్ ఎటెంప్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు సహా అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అతడు మునుపెన్నడూ లేనంతగా పెదవి ముద్దుతో చెలరేగాడు. సుదీర్ఘ ముద్దుల హీరోగా రికార్డులకెక్కుతాడా లేదా? అన్నది అటుంచితే.. నాని ముద్దుల్లోనూ ట్యాలెంట్ చూపించేయడం అది కూడా అందాల కృతి శెట్టిని లిప్ లాక్ వేయడం యూత్ లో ప్రకంపనంగా మారింది.

నాని ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. గతం లోకి వెళితే ఘాటైన చుంబనం పై అంత చర్చ సాగలేదు.. ఇండస్ట్రీలో తొలిగా దర్శకుడు అవ్వాలనుకున్న నాని అనుకోకుండా పెద్ద హీరో అయ్యాడు. నేడు నేచురల్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటున్నాడు.

నేచురల్ స్టార్ అనే కీర్తి ఆయనకి ఒక్క సినిమాతో వచ్చింది కాదు. తన ప్రతీ సినిమాతోనూ ప్రేక్షకులకు క్లాస్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటివరకూ నేచురల్ స్టార్ నటించిన సినిమాల్లో రొమాంటిక్ టచ్ పెద్దగా కనిపించదు.

ఇంటిమేట్ సన్నివేశాలు..లిప్ లాక్ లు లాంటివి ఇప్పటివరకూ నాని కెరీర్ లో ఏ సినిమాలోనూ లేవు. అయితే ఇటీవల విడుదలైన `శ్యామ్ సింగరాయ్` టీజర్ లో మాత్రం లిప్ లాక్ సీన్ తో కనిపించాడు.

హీరోయిన్ కృతిశెట్టి నానితో ఈ లిప్ లాక్ సీన్ లో నటించింది. టీజర్ చివర్లో ఈ సీన్ ని హైలైట్ చేసారు. టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఒక్క టీజర్ సినిమాపై అంచనాల్ని ఒక్కసారిగా పెంచేసింది. తాజాగా ఈ లిప్ లాక్ పోస్టర్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

ఇది నానిలో రెండవ షేడ్ గా చెప్పొచ్చు. కూల్ గా క్లాస్ గా కనిపించే నాని ఒక్కసారిగా ఇలాంటి సన్నివేశంలో నటించడం సర్వత్రా చర్చకొస్తుంది. కృతి శెట్టితో నాని రొమాంటిక్ సన్నివేశాలు సినిమాలో హైలైట్ గా కనిపించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే విడుదలైన తొలి లిరికల్ సాంగ్ శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

తాజాగా సెకెండ్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. నవంబర్ 25న `ఈడో..ఈడో` అంటూ సాగే మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేయడానికి చిత్రబృందం రెడీ అవుతోంది. ఈ చిత్రానికి మిక్కీ.జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు. రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 24న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.