పెళ్లైన తర్వాత కొంత మంది భామలు స్పీడ్ తగ్గిస్తారు. కొన్ని కట్టుబాట్లు అంటూ ఉన్నాయి కాబట్టి వాటిని బ్రేక్ చేయకుండా బ్యాలెన్స్ చేస్తుంటారు. సెలక్టివ్ గా స్ర్కిప్ట్ లను ఎంపిక చేసుకుని కెరీర్ ని ప్లాన్ చేసుకుంటారు. అయితే మరికొంత మంది మాత్రం వృత్తిని వృత్తిగానే భావించి పాత్రలకు న్యాయం చేయాలంటూ ఏమాత్రం వెనక్కి తగ్గరు. పర్సనల్ లైఫ్ వేరు..ప్రొఫెషనల్ లైఫ్ వేరు అంటూ రెండిటినీ డివైడ్ చేసి కెరీర్ ని ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వాళ్లలో నేటి జనరేషన్ చూసుకుంటే కరీనా కపూర్..ప్రియాంకచోప్రా.. లారాదత్తా.. రాధికా ఆప్టే..సమంత లాంటి వారు ముందు వరుసలో కనిపిస్తున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ సమంత నాగచైతన్యని వివాహం చేసుకున్న తర్వాత ఆఫ్ ది స్ర్కీన్…ఆన్ ది స్ర్కీన్ ఎలా చెలరేగిందో చెప్పాల్సిన పనిలేదు. `ఫ్యామిలీ మ్యాన్-2` వెబ్ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాల్లో నటించి హాట్ టాపిక్ గామారింది. సామ్ ఇలా నటించడంపై అక్కినేని అభిమానుల భగ్గుమన్నారు. అయినా సమంత డోంట్ కెరీర్ అంటూ ముందుకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ జంట విడాకుల తో వేరైన సంగతి తెలిసిందే. ఇక రాధిక ఆప్టే సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకుంది. ఆమె నటించే ఇంటిమేట్ సన్నివేశాల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. వెబ్ సిరీస్ ల్లో నెట్ ప్లిక్స్ కే హాట్ బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయింది. అంతగా ఆ వేదికపై ఫేమస్ అయింది.
గ్లోబల్ స్టార్ గా వెలిగిపోతున్న ప్రియాంక చోప్రా ఏకంగా హాలీవుడ్ కి వెళ్లి మరీ రొమాంటిక్ సన్నివేశాల్లో చెలరేగిపోతుంది. వృత్తి విషయంలో ఏమాత్రం రాజీకి రాకుండా విమర్శలు వెల్లు వెత్తినా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంది. ఇటీవలే `ది వాంటెడ్ టైగర్` లో బోల్డ్ సీన్స్ లో మునిగి తేలింది. కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటిమేట్ సన్నివేశాలు ఏమాత్రం బ్రేకులు వేయలేదు. ఇటీవలే `కీ అండ్ కా`లో అర్జున్ కపూర్ తో ఓ రేంజ్ లో బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. మహేష్ భూపతిని పెళ్లాడిన తర్వాత లారా దత్తా రొమాన్స్ లో ఏమాత్రం వేగం తగ్గించలేదు. హిక్కప్స్ అండ్ హుకప్స్ లో బోల్డ్ సీన్స్ లో చెలరేగిన సంగతి తెలిసిందే.