రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా అన్ని అనుకూలంగా ఉంటే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉందేది. ఇప్పటికే సినిమా హిట్ గురించి మాట్లాడుకుంటూ కలెక్షన్స్ లెక్క.. ఓపెనింగ్స్ లెక్క యూఎస్ ప్రీమియర్స్ వసూళ్లు ఇలా ఆర్ ఆర్ ఆర్ గురించే అన్ని చోట్ల మాట్లాడుకునేవాళ్లం. సినిమా ప్రేమికులు ఆర్ ఆర్ ఆర్ వాయిదా పడటంతో ఎంతగా ఆవేదన వ్యక్తం చేశారో తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ అభిమానులు మరియు ప్రేమికులు ఆర్ ఆర్ ఆర్ వాయిదాతో ఉసూరుమన్నారు. ఆ బాధలో ఉన్న సినీ ప్రేమికుల ముందుకు చిన్న సినిమాలు వస్తే పట్టించుకుంటారు. తిమింగలం చూడాలనుకున్న వారికి చిన్న చేపలను చూపిస్తే మాత్రం సంతృప్తి చెందుతారా అనేది అనుమానమే.
ఆర్ ఆర్ ఆర్ వాయిదా తో వెంటనే రానా నటించిన ఒక సినిమా 1945 ను మరియు ఆది సాయి కుమార్ నటించిన అతిధి దేవోభవ సినిమాలను విడుదల చేశారు. నేడు ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాయి అంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఏమాత్రం హడావుడి కనిపించడం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చి ఉంటే దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్ల వద్ద హడావుడి మామూలుగా ఉండేది కాదు. తెల్లవారు జాము నుండి మొదలుకుని థియేటర్ల వద్ద హడావుడి కనిపించేది. కాని ఈ సినిమా విడుదల సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో హడావుడి అయితే ఏమీ కనిపించడం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం వెయిట్ చేసిన ప్రేక్షకులు ఆ సినిమా వాయిదా పడటంతో ప్రస్టేషన్ తో ఉన్నారు. దాంతో ఈ సినిమా కోసం థియేటర్ కు వెళ్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.
మొదటి ఆట.. రెండవ ఆట వరకు కాస్త డల్ గా థియేటర్ల వద్ద ఉన్నా టాక్ కనుక పాజిటివ్ గా వస్తే రానా నటించిన 1945 బాగుందని లేదా ఆది ఈసారి హిట్ కొట్టాడు అంటూ మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే ఖచ్చితంగా సినిమా థియేటర్ల వద్ద జనాలు క్యూ కట్టే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాను భారీగా ప్రమోట్ చేయడం కంటే మౌత్ పబ్లిసిటీతోనే ఎక్కువగా ఫలితం ఉంటుంది. ఆ మౌత్ పబ్లిసిటీ సినిమా హిట్ అయితే వస్తుంది. మరి ఈ రెండు సినిమాలు హిట్ టాక్ దక్కించుకుని ఆర్ ఆర్ ఆర్ ను మిస్ అయిన లోటును కొంతలో కొంత అయినా పూడ్చేనా అనేది చూడాలి. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వచ్చే సంక్రాంతి సీజన్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు చాలా సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. కనుక నేడు విడుదల అయిన సినిమాలను ఎంత వరకు పట్టించుకుంటారు అనేది చూడాలి.