హరి హర వీరమల్లు కోసమేనా పవన్ ఇలా..!

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నా కూడా ఏమాత్రం ఆయన గ్లామర్ తగ్గలేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాల్లో భాగంగా ఎప్పుడు మీడియా ముందుకు రావడం చేస్తున్నాడు. సినిమా తారలు ఎప్పడు మీడియా ముందుకు రావడం వల్ల ఇమేజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం ఉంది. కాని పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాజకీయ కార్యక్రమం లేదా మరే కార్యక్రమం కోసం వచ్చినా కూడా ఆయన లుక్ గురించి క్రేజీగా చర్చించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా పవన్ కళ్యాణ్ ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన సమతా మూర్తి విగ్రహంను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన లుక్ అందరిని ఆకట్టుకుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రతి సమావేశంలో కూడా లుక్ చాలా కూల్ గా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

భీమ్లా నాయక్ సినిమా ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ త్వరలోనే హరి హర వీరమల్లు సినిమా సూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. కనుక కాస్త జుట్టు పెంచి లుక్ ను మార్చుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కొత్త తరహా లుక్ ఖచ్చితంగా హరి హర వీరమల్లు కోసం అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు క్రిష్ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే సగం పూర్తి చేశాడు. బ్యాలన్స్ వర్క్ ను మార్చి లో పూర్తి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను ఈ లుక్ లో చూసిన అభిమానులు ఖచ్చితంగా హరి హర వీరమల్లు సినిమాలో ఆయన లుక్ మరో లెవల్ లో ఉండటం ఖాయం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లో పోలీస్ గా కనిపించబోతున్నాడు. ఇక భీమ్లా నాయక్ సినిమాలో మెఘలాయిల కాలంలోని ఒక దొంగ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఇలాంటి ఒక పీరియాడిక్ సినిమాను చేయలేదు. కనుక ఈ సినిమా ఆయన అభిమానులకు చాలా ప్రత్యేకం అనడంలో సందేహం లేదు.

సినిమా షూటింగ్ ను చకచక పూర్తి చేసి ఇదే ఏడాది ద్వితీయార్థం లో విడుదల చేయాలనే పట్టుదలతో క్రిష్ వర్క్ చేస్తున్నాడు. మరి ఆయన భావించినట్లుగా ఈ ఏడాదిలో సినిమా ను విడుదల చేయడం సాధ్యమా అనేది చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో పాటు కరోనా వల్ల అనుకున్న ప్రకారం షెడ్యూల్స్ జరగక పోవచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.

అందుకే విడుదల విషయంలో కాస్త అటు ఇటు అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఎప్పుడు విడుదల అయినా కూడా హరి హర వీరమల్లు సినిమా మరో రేంజ్ ఎంటర్ టైన్మెంట్ ను అభిమానులకు అందిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.