ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీని టికెట్ ధరల నియంత్రణ పేరుతో ఇబ్బంది పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ ఆర్ ఆర్ కు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. నిన్న సాయంత్రం రాజమౌళి, డివివి దానయ్య జగన్ నివాసమైన తాడేపల్లిలో కలిశారు. ఆర్ ఆర్ ఆర్ కు స్పెషల్ పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరారు.
ఇక ఈరోజు ప్రెస్ తో మాట్లాడిన రాజమౌళి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ కు 100 రూపాయల టికెట్ హైక్ కు జగన్ ఒప్పుకున్నట్లుగా రాజమౌళి తెలిపాడు. అంతే కాకుండా రోజుకు ఐదు షోస్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
24న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ కు స్పెషల్ ప్రీమియర్ ఉంటుందని తెలిపాడు. ఈ రకంగా చూసుకుంటే ఆర్ ఆర్ ఆర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఓపెనింగ్ సాధించేలా కనిపిస్తోంది.