ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా చర్చిస్తున్న చిత్రం రాధే శ్యామ్. భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. క్రిటిక్స్ పరంగా కొన్ని విమర్శలు ఎదురైనా కానీ ఈ సినిమా సాంకేతిక ప్రమాణాలను అందరూ ప్రశంసిస్తున్నారు. సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ఆద్యంతం థీమ్ ని స్వచ్ఛమైన ప్రేమతో నింపింది. ప్రతి సందర్భంలోనూ ప్రేక్షకులను సినిమాకు ఆత్మగా భావించేలా చేసింది మ్యూజిక్ ఫోటోగ్రఫీ. పాటలకు సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకరన్… బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన థమన్ సినిమాని ఉన్నత స్థాయికి చేర్చారు.
రాధే శ్యామ్ కి జస్టిన్ ప్రభాకరన్ నిజంగా మనోహరమైన మెలోడీలను అందించారు. ప్రతి పాట నిర్దిష్ట సన్నివేశానికి సరిగ్గా సరిపోతుంది. అవి కథన ప్రవాహానికి అంతరాయం కలిగించకుండా సినిమాతో చాలా సాఫీగా మిళితం అయ్యాయి. సంచారి అనే పాట హీరోని పరిచయం చేస్తూ… అతని ప్రపంచాన్ని సృష్టించి.. ప్రేక్షకులను అతని ప్రపంచాన్ని ఆవిష్కరించేలా చేస్తుంది.
ఈ రాతలే.. ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ మెలోడీలలో ఒకటి. ఈ పాట లీడ్ పెయిర్ జీవితాలను వారి ప్రేమను ఎప్పుడూ కలిసిపోకుండా ప్రతిబింబిస్తుంది. నగుమోము తారాలే ఈ మధ్య కాలంలో వచ్చిన మరో మధురమైన రాగం. ఈ పాట ప్రేక్షకులకు చల్లగాలికి సేదదీరుతున్న అనుభూతిని కలిగిస్తుంది. ప్రేమ లోతైన పొరల్లో దాగివున్న బాధను నిన్నెల చిందులేస్తుంది. జస్టిన్ తన కెరీర్లో అత్యుత్తమ ఆల్బమ్ ని రాధే శ్యామ్ కోసం అందించాడు.
దర్శకుడి కోణంలో సినిమాను చూసిన ఏకైక వ్యక్తి థమన్. ఆ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాధాకృష్ణే చెప్పాడు. సినిమాలో దాగి ఉన్న ఆత్మను థమన్ అర్థం చేసుకోగలడని దానిని తన సంగీతంతో బెటర్ మెంట్ చేశాడని రాధాకృష్ణ అన్నారు. రాధే శ్యామ్ కోసం థమన్ మ్యూజికల్ స్క్రీన్ ప్లే రాశాడని కూడా చెప్పాడు. అలాంటి అసాధారణమైన పనిని థమన్ సినిమా కోసం చేశాడు.
మొదటి చూపులోనే విక్రమాదిత్య ప్రేరణ కోసం పడిపోయే రైలు ఎపిసోడ్ లో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. శృంగార సంగీత ప్రయాణాన్ని ఆరంభించడానికి ఇచ్చిన రిథమ్ చిత్రానికి హైలైట్. అలాగే థమన్ జస్టిన్ మెలోడీలను బాగా ఉపయోగించుకున్నాడు. ప్రీ-క్లైమాక్స్ .. క్లైమాక్స్ సన్నివేశాలలో థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను వరుసగా ఎమోషనల్ ..గా యాక్షన్ రైడ్స్ లోకి దించుతుంది.
ఇన్నేళ్లుగా ఎలివేషనల్ .. కమర్షియల్ స్కోర్ లకు పేరు తెచ్చుకున్న థమన్ రాధే శ్యామ్ తో ప్రేమకథా చిత్రాల మ్యుజీషియన్ గా మాంత్రికుడిగా మారి కొన్ని మనోహరమైన తనదైన సంగీతంతో ప్రజల హృదయాలను దోచుకున్నాడు. కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్న రాధేశ్యామ్ కి టెక్నీషియన్స్ ప్లస్ అనడంలో సందేహం లేదు. తాజాగా రిలీజ్ చేసిన రాధేశ్యామ్ థీమ్ మ్యూజిక్ ఎంతో ఆకట్టుకుంటోంది. వేగంగా వైరల్ అవుతోంది.