ప్రాజెక్ట్ కే కొత్త గాపిస్.. మొత్తం అంచనాలు తారు మారు

ప్రభాస్ హీరోగా మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే. ఈ సినిమా టైమ్ ట్రావెలర్ మూవీ అంటూ ఆరంభం కాక ముందు నుండి ప్రచారం జరుగుతూ వస్తుంది. అందుకే ఆదిత్య 369 క్రియేటర్ అయిన సింగీతం వారిని ఈ సినిమా కు మెంటర్ గా తీసుకున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రాజెక్ట్ కే గురించి సరికొత్త పుకారు ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు చేస్తుంది.

ప్రాజెక్ట్ కే సినిమా లో ప్రభాస్ తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కనిపించబోతున్న విషయం తెల్సిందే. అమితాబచ్చన్ ఈ సినిమాలో నటిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. షూటింగ్ ప్రారంబోత్సవం రోజే ఈ సినిమాలో బిగ్ బి ఒక గురువు గా లేదా బాబాగా కనిపించబోతున్నాడు అంటూ ఆయన లుక్ ను బట్టి వార్తలు వచ్చాయి. తాజాగా అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్రలో కనిపించబోతున్నట్లుగా పుకారు వినిపిస్తుంది.

అశ్వద్ధామ అంటే మహా భారతం లోని పాత్ర అనే విషయం తెల్సిందే. అస్సలు మరణం లేని వ్యక్తి అశ్వద్ధామ అంటూ మహా భారతం లో ఉంటుంది. కనుక మహా భారతంతో ప్రాజెక్ట్ కే కు లింక్ పెట్టి సినిమాను తీస్తున్నట్లుగా కొత్త ఊహలు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ ను రామాయణ ఇతివృత్తంతో చేస్తున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కే ను మాత్రం మహా భారతంతో చేయడం జరుగుతుందని సరికొత్తగా ప్రచారం మొదలైంది.

ఇప్పటి వరకు ఉన్న అంచనాలు తలకిందులు చేసి మూడు నాలుగు రెట్ల అంచనాలు పెంచే విధంగా కొత్త పుకారు ఉంది అనడంలో సందేహం లేదు. మహా భారతం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కాని ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

మహా భారతంలోని ఇతర పాత్రలు ఏమీ కనిపించవు. కాని అప్పటి కాలంకు చెందిన అశ్వద్ధామ ఇంకా బతికే ఉంటాడు.. తద్వార కథలో పార్ట్ అవుతాడు అంటున్నారు.

అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ మహా భారతంతో కనుక కనెక్షన్ ను పెట్టి ప్రాజెక్ట్ కే ను తెరకెక్కిస్తే ఖచ్చితంగా అద్బుతం అంటూ ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపించడం ఖాయం. సింగీతం వారి ఆధ్వర్యంలో ఈ కథ తయారు అయ్యింది. ఈ పుకారు సినిమా టైమ్ ట్రావెల్ స్టోరీ తో నడుస్తుందని నమ్మకాన్ని మరింత కలిగిస్తుంది.