ప్రముఖ ఫిలిం మేకర్ రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి గత కొంత కాలంగా కన్నడ బ్యూటీ నిక్కి గర్లానీ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి పలు సినిమాల్లో నటించడం తో వీరిద్దరి మధ్య ఖచ్చితంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది అంటూ మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. కాని ఎప్పుడు కూడా అధికారికంగా ఆది స్పందించలేదు. కానీ ఉన్నట్టుండి ఆది తన వివాహ నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేసి అందరికీ షాకిచ్చాడు.
ఈనెల 24వ తారీఖున వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది. అతి త్వరలోనే పెళ్లి కూడా జరగబోతున్నట్లు తెలుస్తుంది. నిశ్చితార్థం కు ప్రముఖులు ఎవరూ హాజరు కాలేదని సమాచారం. కానీ పెళ్లికి మాత్రం భారీ ఎత్తున సినీ ఇండస్ట్రీ వర్గాల వారు హాజరు కాబోతున్నట్లు గా తెలుస్తోంది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఆది చాలా ఫేమస్ అయ్యాడు. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా తనదైన ముద్ర వేసిన ఆదికి వివాహ నిశ్చితార్థం సందర్భంగా మా తరఫున మీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.