హీరోయిన్లు ఇప్పుడు స్పెషల్/ఐటెం సాంగ్స్ చేయటానికి ఎక్కడా వెనుకాడట్లేదు. అయితే ఈ సాంగ్ చేయటానికి హీరోయిన్లు భారీ పారితోషికాలు తీసుకుంటారన్న విషయం కూడా తెల్సిందే. రీసెంట్ గా పుష్పలో చేసిన ఐటమ్ సాంగ్ కు కోటిన్నర రూపాయల పారితోషికం తీసుకుందిట సమంత. ఇప్పటిదాకా ఐటమ్ సాంగ్ రెమ్యునరేషన్ల విషయంలో అదే హయ్యస్ట్.
అయితే ఇప్పుడు ఆ రికార్డును తుడిచిపెట్టేసింది పూజ హెగ్డే. ఎఫ్ 3లో పూజ స్పెషల్ సాంగ్ లో నర్తిస్తోన్న విషయం తెల్సిందే. ఇటీవలే సాంగ్ షూట్ కూడా మొదలైంది. ఈ పాటకు ఏకంగా కోటి 75 లక్షల పారితోషికాన్ని తీసుకుంటోందిట పూజ హెగ్డే.
అంతే కాదు ఇప్పుడు ఈ భామను హీరోయిన్ గా పెట్టుకోవాలంటే 2 కోట్ల 75 లక్షల రూపాయల నుండి 3 కోట్ల వరకూ డిమాండ్ చేస్తోంది. వరసగా 2 ప్లాపులు వచ్చినా పూజ హెగ్డేకు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు.