చిరు కు హీరోయిన్ లేదు ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటీ?

రాజకీయాల్లోకి వెళుతున్నానని మెగాస్టార్ చిరంజీవి గతంలో దాదాపు పదేళ్లు సినిమాకు బ్రేకిచ్చారు. ఆ సమయంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. అటు రాజకీయాల్లోనూ రాణించలేదు. ప్రత్యర్థులు ఫ్యామిలీని ఫ్యామిలీ మెంబర్స్ ని టార్గెట్ చేయడంతో రాజకీయాలంటేనే చిరుకు విరక్తి పుట్టుకొచ్చింది. కాంగ్రెస్ లో బలవంతంగా తన పార్టీని విలీనం చేసి ఎంపీగా మారినా చిరు అందులోనూ ఇమడలేకపోయారు. చివరికి రాజకీయాలకు దూరంగా వుండటం మొదలు పెట్టారు. ఇక పదేళ్ల విరామం తరువాత `ఖైదీ నంబర్ 150`తో మళ్లీ కెమెరా ముందుకొచ్చారు.

గ్యాప్ వచ్చినా తన గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఆ తరువాత డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా `సైరా నరసింహారెడ్డి` చిత్రాన్ని చేశారు. దీని తరువాత చిరు నుంచి సినిమా వచ్చి దాదాపు రెడేళ్లు పైనే అవుతోంది. కరోనా కారణంగా గ్యాప్ ఏర్పడటంతో ఈ సారి `ఆచార్య`గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారాయన.

సామాజిక అంశం నేపథ్యంలో ఈ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించారు. ఇందులో మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ కీలక అతిథి పాత్రలో నటించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఇదిలా వుంటే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ రామ్ చరణ్ తో మొదలవడం.. అందులో చరణ్ కు సంబంధించిన సన్నివేశాలే అధికంగా వుండటం.. ట్రైలర్ మధ్యలో చిరు పాత్ర ఎంటర్ కావడంతో ఇది చిరు సినిమానా? లేక రామ్ చరణ్ సినిమానా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా చరణ్ సినిమాలో చిరు గెస్ట్ క్యారెక్టర్ చేసినట్టుగా వుందని కామెంట్ లు వినిపించాయి. ఆ కామెంట్ లని ఇప్పడు దర్శకుడు కొరటాల శివ నిజం చేసినట్టుగా కనిపిస్తోందని తాజాగా వాదనలు వినిపిస్తున్నాయి. సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ లేకపోవడం.. చరణ్ కు మాత్రమే హీరోయిన్ వుండటంతో

ఫ్యాన్స్ లో కొత్త డౌట్ లు మొదలవుతున్నాయి. ఇంతకీ ఇది బాస్ సినిమానా? లఏక చరణ్ సినిమానా అనే అనుమానాల్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరు సినిమా అంటే ఫైట్స్ తో పాటు డాన్యులు.. మెరుపులు కామన్.

ఇక్కడ హీరోయినే లేకపోతే ఆ మెరుపులు వుండవు.. రొమాంటిక్ యాంగిల్ వుండదు. మరి దీన్ని ఫ్యాన్స్ అంగీకరిస్తారా?..చిరుకు హీరోయిన్ లేదంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా?.. చిరు కు ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటీ? .. ఎలా వుండబోతోంది? అన్నది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మెగాస్టార్ కు హీరోయిన్ లేదని తాజాగా డైరెక్టర్ కొరటాల శివ స్పష్టం చేయడంతో కొత్త చర్చ మొదలైంది. చిరుకు హీరోయిన్ లేకుండా సినిమా ఏంటి? అని కొంత మంది అభిమానులు వాపోతున్నారట. అంతే కాకుండా బాస్ సినిమా ఏంటీ? ఆయన పక్కన హీరోయిన్ లేకపోవడం ఏంటీ? అని షాకవుతున్నారట. కాజల్ సినిమాలో లేదని చిరుకు `ఆచార్య`లో అసలు హీరోయినే లేదని కొరటాల శివ చేసిన ప్రకటనపై మెగా ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.