పవన్ కళ్యాణ్ చుట్టూ పెద్ద రచ్చ జరుగుతోంది. చిన్న నవ్వు సమాధానంగా ఇస్తున్నారాయన రాజకీయాల్లో. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గురించి, కీలక పదవుల్లో వున్న వ్యక్తులు ‘మొరుగుతున్నారంటే’, ఇక్కడ ఎవరు అసలు సిసలు సింహం.? ఎవరు గ్రాహ సింహం.?
‘గుంపులుగా వచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.. సింహం సింగిల్‌గా ఎదురుచూస్తోందిక్కడ.. ఆ గుంపుని చెదరగొట్టడానికి..’ అంటూ ‘తీసేసిన తాసీల్దారు’ ఒకాయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేశారు. రాజకీయాలన్నాక విమర్శలు సహజాతి సహజం. అధినేత మెప్పుకోసం అడ్డగోలుగా రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడం, సోకాల్డ్ ‘జీతగాళ్ళకు’ అలవాటైపోయిందనుకోండి.. అది వేరే సంగతి.
పొత్తులు పెట్టుకుంటే ‘గుంపు’ అని అనడం సబబు కాదు.. పొత్తులు పెట్టుకోకపోతే ‘సింహం’ అనడం అస్సలే సబబు కాదు. చేతనైతే, ఎన్నికల్లో కరెన్సీ నోటు పంచకుండా పోటీ చేసి గెలుస్తామని చెప్పగలగాలి. అదీ ‘సింహం’ లక్షణం.!
ఓటుకు రేటు కట్టి, కిరాయికి జనాల్ని రప్పించి.. లిక్కర్ బాటిల్ పంచి, కరెన్సీ నోట్లు ఇచ్చి చేసేదాన్ని రాజకీయం అనరు. దానికి వేరే పేరు పెట్టాలి. రాజకీయమంటే సేవ.! ఔను, రాజకీయాలంటే ‘సేవ’ అనుకునేవారికి మాత్రమే సింహానికీ, గ్రామ సింహానికీ తేడా తెలుస్తుంది. అది తెలియనోళ్ళే, గ్రామ సింహాన్ని చూసి.. అదే నిజమైన సింహమనే భ్రమల్లో.. మొరుగుతుంటారు.!
‘అది సింహం కాదు, గ్రామ సింహం..’ అని అర్థమైనోళ్ళు ఒకరొకరుగా, ఆ బోను లోంచి బయట పడక తప్పదు. అలా బయటపడే సమయం కూడా దగ్గరకొచ్చేసింది. జస్ట్ కొన్ని రోజులు మాత్రమే.! ఈలోగా మతి భ్రమించి.. లేదా మత్తులో నోటికొచ్చిందల్లా వాగేవాళ్ళ వాగుడుని జనం భరించాల్సిందే, తప్పదు.!