పవన్ కళ్యాణ్ ని ‘బాబాయ్’ అని సంభోదించిన నందమూరి హీరో..!

టాలీవుడ్ లో రెండు పెద్ద సినీ ఫ్యామిలీలైన మెగా – నందమూరి హీరోల మధ్య దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ నడుస్తోందనే సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉన్నా.. బయట మాత్రం ఇరు వర్గాలు సన్నిహితంగానే మెలుగుతుంటాయి.

ఇటీవల ఈ రెండు వర్గాలకు చెందిన జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా చేసి ప్రేక్షకులను విశేషంగా అలరించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది.

అయితే నందమూరి ఫ్యామిలీకి చెందిన తారకరత్నకు మెగా హీరో పవన్ కళ్యాణ్ ను బాబాయ్ అని పిలిచేంత చనువు కూడా ఉందని చాలా మందికి తెలియదు. తారకరత్న తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ ను “బాబాయ్” అని సంభోదించడంతో ఈ విషయం అందరికీ తెలియవచ్చింది.

తారక రత్న ఈ ఇంటర్వ్యూలో తన పొలిటికల్ ఎంట్రీ గురించి.. టీడీపీ-జనసేన పొత్తులు మరియు పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో చంద్రబాబు మరియు పవన్ కి మధ్య పోటీ లేదని అన్నారు.

తన మామయ్య చంద్రబాబు – బాబాయి బాలకృష్ణ ప్రజలకు చేయగలిగినదంతా చేస్తూ ముందుకు సాగుతున్నారని.. ప్రజలకు సేవ చేసేందుకు తనవంతు కృషి చేస్తున్నానని తారకరత్న తెలిపారు. ఈ క్రమంలో పవన్ ను బాబాయ్ అని పిలుస్తానని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు.

జనాలకు మంచి చేయాలనే సదుద్దేశంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉందని తారక రత్న వెల్లడించారు. 2024లో జనసేన – టీడీపీ పొత్తుల గురించి తనకు తెలియదన్న నందమూరి హీరో.. దానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తాను పవన్ కళ్యాణ్ ను బాబాయ్ అని పిలుస్తానని తెలిపారు తారకరత్న. ప్రజల కోసం పవన్ బాబాయ్ కష్టపడుతున్నారని.. ఆయన స్థాయిలో ఆయన పని చేస్తున్నారన్నారు. చిన్నప్పటి నుంచి తాను పవన్ కల్యాణ్ సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పారు. చంద్రబాబు – పవన్ కల్యాణ్ మధ్య పోటీలాగా తాను చూడటం లేదని అన్నారు.

ఇకపోతే అందరం టీడీపీ కోసం పని చేస్తామని.. తన మామయ్య చంద్రబాబు సూచనల మేరకు ముందుకు సాగుతామని తారకరత్న చెప్పుకొచ్చారు. ఏదేమైనా పవన్ ని నందమూరి హీరో ‘బాబాయ్’ పిలవడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా సక్సెస్ క్రెడిట్ కోసం మెగా మరియు నందమూరి అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అయితే రియల్ లైఫ్ లో మాత్రం రెండు కుటుంబాలకు చెందిన హీరోలు మంచి సాన్నిహిత్యాన్ని పంచుకుంటున్నారని తెలుస్తోంది. అభిమానులు కూడా ఈ వాస్తవాన్ని గ్రహించి మెలిగితే బాగుంటుంది.