విజయ్ 67లో ఆ ఇద్దరు డైరెక్టర్లు?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న `వారీసు`లో నటిస్తున్నాడు. దిల్ రాజు శిరీష్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తెలుగులో `వారసుడు`గా విడుదల కానున్న ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో సంక్రాంతి విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే థియేర్లకు సంబంధించిన ఏర్పాట్లని నిర్మాత పూర్తి చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం విజయ్ పై ఇంట్రో సాంగ్ ని షూట్ చేస్తున్న చిత్ర బృందం తరువాత హైవరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో యాక్షన్ ఘట్టాలని చిత్రీకరిస్తారట. వచ్చే వారం క్లైమాక్స్ సన్నివేశాలని భారీ స్థాయిలో చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విజయ్ నటించనున్న విషయం తెలిసిందే. ఇది విజయ్ 67వ మూవీ. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరపైకి తీసుకురానున్నాడట.

`మాస్టార్` తరువాత విజయ్ – లోకేష్ కనగరాజ్ ల కలయికలో రానున్న ఈ మూవీ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. అంతే కాకుండా ఈ మూవీలో మరో ఇద్దరు డైరెక్టర్లు కూడా నటించబోతున్నారని కోలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. విభిన్నమైన సినిమాలతో దర్శకులుగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నా గౌతమ్ మీనన్ మిస్కిన్ లు నటించనున్నారట. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలోనే ఈ మూవీ కూడా సెట్స్ పైకి వెళ్లనుందని ఇన్ సైడ్ టాక్.

ఈ డిసెంబర్ ఎండింగ్ లో రెగ్యులర్ షూట్ ని ప్రారంభించాలని కరెక్ట్ గా అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే వచ్చే ఏడాది దీపావళికి ఈ మూవీని రిలీజ్ చేయాలని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారట.

అనిరుధ్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో `విక్రమ్` ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీని లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. విజయ్ తో చేయబోతున్న సినిమాకు `విక్రమ్`కు లింక్ వుంటుందని తెలుస్తోంది. కమల్ చిన్న కామియో ఇచ్చే అవకాశం కూడా వుందని ప్రచారం జరుగుతోంది.

ఈ మూవీని `మాస్టర్`కు ప్రీక్వెల్ గా తీస్తాడా? .. లేక `విక్రమ్`లో కార్తి `ఖైదీ`ని ఎంటర్ చేసినట్టుగా విజయ్ సినిమాని ఇంటర్ లింక్ చేస్తాడా? అన్నది దర్శకుడు లోకేష్ కనగరాజ్ వివరణ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.