రామ్ తో రొమాన్స్ మొదలుపెట్టిన శ్రీలీల..!

ఉస్తాద్ రామ్ ది వారియర్ తో ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయాడు. అందుకే చేయబోతున్న బోయపాటి శ్రీను సినిమాను హడావిడిగా కాకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అసలైతే సినిమా ఎప్పుడో మొదలవగా లేటెస్ట్ షెడ్యూల్ లో హీరోయిన్ శ్రీ లీల యాడ్ అయినట్టు తెలుస్తుంది. రామ్ శ్రీలీల మధ్య సీన్స్ ఈరోజు షూట్ స్టార్ట్ చేశారట. సినిమాలోని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో పూర్తి చేస్తారని తెలుస్తుంది.

ధమాకా హిట్ తో సూపర్ జోరులో ఉన్న శ్రీ లీల రామ్ సినిమాకు ఆ హిట్ ఎనర్జీని తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఎంతైనా కెరీర్ లో ఒక సూపర్ హిట్ పడితే ఆ ఎఫెక్ట్ వారు చేస్తున్న సినిమా మీద కచ్చితంగా ఉంటుంది. అలానే శ్రీ లీల ధమాకా హిట్ రామ్ సినిమాకు బాగా కలిసి వచ్చేలా ఉంది. ఇక ఈ సినిమాను బోయపాటి శ్రీను కూడా ఎంతో కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

అఖండ తర్వాత బోయపాటి శ్రీను చేస్తున్న ఈ సినిమాలో రామ్ ని ఇదివరకు ఎప్పుడూ చూడని మాస్ అవతార్ లో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. రామ్ కూడా బోయపాటికి కావాల్సినట్టుగా తన లుక్ మార్చుకున్నట్టు తెలుస్తుంది. రామ్ బోయపాటి కాంబో ఆడియన్స్ కు ఒక మంచి సూపర్ సినిమాను అందిస్తుందని అంటున్నారు. ఈ మూవీని శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

కేవలం తెలుగులోనే కాదు ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ ని మెప్పించేలా రామ్ పాత్రని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఈమధ్య మన తెలుగు హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ పై పడ్డారు.

బీ టౌన్ ఆడియన్స్ కూడా సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. రామ్ తెలుగులో చేసిన సినిమాలు హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంటాయి. ఆ ధైర్యంతోనే రామ్ బోయపాటి శ్రీను సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు.