కోలీవుడ్ యాక్షన్ హీరో అజిత్ తన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎలాగు సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంటారు కదా తెలుగు డబ్ వర్షన్ కూడా రిలీజ్ చేస్తే పోలా అన్న ఆలోచన తప్ప తెలుగు మార్కెట్ ని క్యాష్ చేసుకోవాలన్న ఆలోచన అజిత్ కు ఏమాత్రం లేదు. అలా ఎందుకు అంటే అలాంటి ఆలోచన ఉంటే తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమాలకు తను ప్రమోట్ చేసేవాడు. కానీ అజిత్ అలా చేయడు.. చేయట్లేదు కూడా.
అజిత్ లేటెస్ట్ మూవీ తునివు తెలుగులో తెగింపుగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు అదే సీన్ రిపీట్ అవుతుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తెలుగులో మంచి థియేటర్లు దొరికాయి. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో మొదట రిలీజ్ అవుతున్న సినిమాగా తెగింపు వచ్చింది. అయితే సినిమాకు ఆడియన్స్ నుంచి అనుకున్నంత రెస్పాన్స్ అయితే లేదని చెప్పొచ్చు. సినిమా ఆల్రెడీ ప్రీమియర్స్ పడగా టాక్ కూడా పెద్దగా ఏమి లేదు.
బుక్ మై షో లో తెగింపు సినిమాకు కేవలం 10 శాతం బుకింగ్స్ కూడా లేకపోవడం చూస్తుంటే తెలుగులో అజిత్ గ్రాఫ్ ఎలా పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. సినిమాను ఏదో మొక్కుబడిగా రిలీజ్ చేయకుండా మంచి ప్రమోషన్స్ చేస్తే ఏమన్నా ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. అసలు కొంతమంది ఆడియన్స్ కు అజిత్ తెగింపు సినిమా రిలీజ్ అవుతున్న విషయం కూడా తెలియదు. ఒకప్పుడు అజిత్ తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు.
కానీ రాను రాను తన సినిమాలన్నీ ఒకే రకంగా ఉండటం. యాక్షన్ సినిమాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం లాంటివి తెలుగు ఆడియన్స్ ను రుచించట్లేదు. లేటెస్ట్ గా వచ్చిన తెగింపు సినిమాలో కూడా యాక్షన్ పార్ట్ ఎక్కువైందని తెలుస్తుంది. అయితే కోలీవుడ్ లో అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ కు ఎక్కడ సినిమా వర్క్ అవుట్ అవుతుందేమో కానీ తెలుగులో ఈ సినిమా ఆశించిన స్థాయిలో అయితే రెస్పాన్స్ తెచుకోలేదని అనిపిస్తుంది. తెగింపు ఎలా ఉంది.. సినిమాను కొన్న తెలుగు నిర్మాతలు సేఫా కాదా అన్నది తెలియాలంటే ప్లీజ్ వెయిట్ ఫర్ తుపాకి రివ్యూ.