బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ఎఫైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ భామల నుంచి నవతరం నాయికల వరకూ అందరితోనూ రిలేషన్ షిప్ మెయింటెన్ చేసిన ఒకే ఒక్క స్టార్. సల్మాన్ గాళ్స్ లిస్ట్ తీస్తే చాలా మందే కనిపిస్తారు. 50 ఏళ్లు వచ్చినా భాయ్ పేరు ఇప్పటికీ ఎఫైర్స్ విషయంలో తరుచూ వినిపిస్తూనే ఉంటుంది. ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ లేదని ఫీలైపోతున్నట్లు చెబుతారు గానీ… బ్యాకెండ్ భాయ్ ఎంజాయ్ మెంట్ అన్నది వేరే లెవల్లో ఉంటుంది.
గాళ్స్ తో మీడియాకి చిక్కిన సందర్భాలు కోకొల్లలు. ఇది అందరికి తెలిసిన సత్యమే. ఇటీవలే యంగ్ బ్యూటీ పూజాహెగ్డే తోనూ ప్రేమాయణం సాగిస్తున్నట్లు బాలీవుడ్ సహా అన్ని మీడియాల్లోనూ పెద్ద ఎత్తున హైలైట్ అయింది.
దీనిపై సల్మాన్ గానీ..పూజాగానీ ఇంత వరకూ స్పందించలేదు. దీంతో ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. భాయ్ పెళ్లాడే అమ్మాయి ఆమెనంటూ అని కూడా ప్రచారం సాగింది.
ఈ నేపథ్యంలో తాజాగా భాయ్ నోట వచ్చిన వ్యాఖ్యలు మరింత సందేహానికి తావిస్తున్నాయి. ఓ పాత్రికేయు రాలు సల్మాన్ ని ఉద్దేశించి ఈయన యావత్ దేశానికి భాయ్ అని వ్యాఖ్యనించారు. ఇంతలో సల్మాన్ సీన్ లోకి వచ్చి భాయ్( సోదరుడిని) కాదు. కొంత మందికి జాన్ ను కూడా! అని కాస్త సీరియస్ గానే అన్నారు. దీంతో నెటి జనులు భాయ్ అంతర్గాతాన్ని తవ్వే ప్రయత్నం చేస్తున్నారు.
సోదరుడు అంటే వచ్చిన నష్టమేంటి? అంట! నీ మనసులో ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు అలా ఫీలైతే వచ్చిన నష్టమేంటి? అంటే! సల్మాన్ మనసులో ఎవరో ఉన్నారు అనేగా. ఇదేదో ప్రేమ వ్యవహారంలా ఉందంటూ నెటి జనులు పోస్ట్ లు పెడుతున్నారు. ఇక సల్మాన్ ప్రేమ కహానీలు మూడు నాళ్ల ముచ్చటగానే కనిపిస్తాయి. కొన్ని రోజుల పాటు రిలేషన్ షిప్ లో ఉండటం..తర్వాత బ్రేకప్ అన్నది పరిపాటే.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలో సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే తదుపరి చిత్రాలకు సంబంధించిన పనులు మూవ్ చేస్తున్నారు.