సుమను ఎందుకు అరెస్ట్ చేశారంటే..?

ఇటీవల కాలంలో ఒక సినిమా జనాల దగ్గరకు చేరాలి అంటే మంచి కంటెంట్ ఉంటే సరిపోదు. విడుదల చేసే ముందు ప్రమోషన్స్ ద్వారా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇక ఎంత కొత్తగా ప్రమోషన్ చేస్తే సినిమాకు అంత బజ్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో చాలామంది యువ హీరోలు కొత్తగా ఆలోచిస్తూ సినిమాకు హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక రీసెంట్ గా యాంకర్ సుమ అరెస్టు అయినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తప్పకుండా ఏదో సినిమా ప్రమోషన్స్ లేదా టెలివిజన్ షోలో భాగంగా ఇలా చేసి ఉంటారేమో అని అందరూ అనుకున్నారు. ఇక పక్కనే నరేష్ ఉన్న ఫోటో కూడా వైరల్ కావడంతో ఇది కొత్త సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వీడియో అని అర్థమైపోయింది.

ఇక నరేష్ అలా ఎందుకు మనం అరెస్ట్ చేశాడు అనే వివరాల్లోకి వెళితే నరేష్ నుంచి మరికొన్ని రోజుల్లో ఉగ్రం అనే సినిమా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా సుమతో ఈ విధంగా ఒక ఒక చిన్న ప్రోమో విడుదల చేయబడింది. దీనిలో సుమ అల్లరి నరేష్ను ఎందుకు అరెస్టు చేశారని అడుగుతున్నట్లు కనిపించింది. సుమ తన ఎలిమెంట్లోకి ప్రవేశించి ఎగతాళి చేయడం ప్రారంభించింది.

పూర్తి వీడియో రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నారు. నాంది తర్వాత నరేష్ విజయ్ కనకమేడల ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కోసం మరోసారి చేతులు కలిపారు. మిర్నా కథానాయికగా నటిస్తుంది. ఉగ్రం మే 5మ విడుదల అవుతుంది.

నరేష్ ఎలాగైనా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే సుమతో కొత్తగా ఈ తరహాలో ప్రమోషన్స్ అయితే చేస్తున్నాడు. ఇక ఇంతకుముందు ఈ కాంబినేషన్లో నాంది సినిమా మంచి సక్సెస్ అయింది. కాబట్టి ఈ సినిమాకి కూడా అదే ప్లస్ అవుతుంది అని నరేష్ ఆశిస్తున్నాడు. మరి ఉగ్రం సినిమా ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.