చందమామ కాజల్ అగర్వాల్ మామ్ అయినా తగ్గేదేలే అంటోందా? మరోసారి బికినీ అందాలతో కుర్రకారుని ఫిదా చేయబోతుందా? అంటే అవుననే తెలుస్తుంది. ప్రస్తుతం ఈభామ ‘ఇండియన్ -2’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇటీవలే చెన్నైలో ఓ లాంగ్ షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది.
ఇందులో కాజల్ అగర్వాల్ కూడా పాల్గొంది. ప్రసవం తర్వాత కాజల్ హాజరైన తొలి షెడ్యూల్ ఇది. కమల్ హాసన్ సహా కీలక నటీనటుల పై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఇదే షెడ్యూల్ లో కాజల్ బికినీ తోనూ రచ్చ చేసిందన్న విషయం కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. కమల్ హాసన్ తో కొన్ని రొమాంటిక్ సీన్స్ లో భాగంగా కాజల్ బికినీలో దర్శనిమిచ్చిందని సమాచారం.
హీరోయిన్ల బ్యూటీ ని హైలైట్ చేయడంలో శంకర్ తక్కువేం కాదు. డిజైనర్ దుస్తుల్లో కావాల్సిన మసాలాని దట్టించడం ఆయన స్పెషాల్టీ. ఈ నేపథ్యంలో శంకర్ టేస్ట్ కు అనుగుణంగా కాజల్ అందచందాలతో మెప్పించబోతుందని తెలుస్తోంది. బికినీ సన్నివేశాలు కాజల్ కి కొత్తేంకాదు. గతంలో పలు సినిమాల్లో బికినీతో రచ్చే చేసింది. అలాగే వ్యక్తిగత ఫోటో షూట్ల కోసం..వెకేషన్ స్పాట్ లో ఎన్నోసార్లు బికినీ దుస్తుల్లో హైలైట్ అయింది.
అయితే పెళ్లిన తర్వాత.. అందులోనూ తల్లిగా ప్రమోషన్ అందుకున్న తర్వాత బికినీ వేయడం మాత్రం ఆసక్తికరం. అయితే ఆఛాన్స్ తీసుకోవడానికి కారణం శంకర్ అనే తెలుస్తుంది. శంకర్ కి విజన్ కి తగ్గట్టు హైలైట్ అవ్వాలంటే ఆయన చెప్పినట్లు చేయాల్సిందే.
దీంతో కాజల్ కాదనలేక బికీన వేసినట్లు తెలుస్తుంది. తల్లి అయిన తర్వాత కాజల్ బ్యూటీలో మార్పులొచ్చిన సంగతి తెలిసిందే. ముఖం సహా శరీరం లో కొన్ని రకాల మార్పులొచ్చాయి. మునుపటంత ఛాయ కనిపించలేదు. మరి ‘ఇండియన్-2’ లో బికినీ ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం కాజల్ చేతిలో ఈ సినిమాతో పాటు బాలయ్య 108వ సినిమా ఉంది. అలాగే ఓ హిందీ సినిమాలోనూ నటిస్తోంది.