నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్రేక్షకులకు స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ ద్వారా సుపరిచితురాలైన మిల్లీ బాబీ బ్రౌన్ మరో సారి వార్తల్లో నిలిచింది. ఈ టీనేజర్ అమ్మాయి పెళ్లికి సిద్ధం అయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ 19 ఏళ్ల అమ్మాయి ఇంత చిన్న వయసులోనే పెళ్లికి సిద్ధం అవ్వడం ఏంటి అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అమెరికన్ సింగర్ జాన్ బన్ జోవి కొడుకు అయిన జేక్ బొంగివోవి తో ప్రేమలో పడింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం మరో అడుగు ముందుకు పడి ఏకంగా ఎంగేజ్మెంట్ వరకు వెళ్లింది.
ఇరు కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహ నిశ్చితార్థం జరిగింది. మిల్లీ బాబీ బ్రౌన్ వయసు 19 ఏళ్లు కాగా… జేక్ బొంగివోవి వయసు 20 ఏళ్లు అంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
2021 లోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. మొదటి సారి వీరిద్దరి ఫొటో ఆ సమయంలో బయటకు వచ్చింది.
కానీ ఆ సమయంలో మిల్కీ బాబీ బ్రౌన్ వయసు చాలా తక్కువ కనుక ప్రేమ విషయం గురించి ఎక్కువ వార్తలు రాలేదు. ఇప్పుడు మిల్లీ పెళ్లికి సిద్ధం అవ్వడం సర్ ప్రైజ్ గా ఉందని ఆమె అభిమానులు అంటున్నారు.
టీనేజ్ లోనే ఇద్దరి మధ్య ప్రేమ నడవడం.. ఇంత చిన్న వయసులోనే పెళ్లి పీటలు ఎక్కడం కూడా విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జస్ట్ 19 కే పెళ్లి అవసరమా అంటూ కొందరు విమర్శిస్తూ ఉంటే.. ప్రేమకు పెళ్లికి వయసు తో సంబంధం ఏంటి అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. నిశ్చితార్థం అయి పోవడంతో ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ లో పెళ్లి ఉంటుందని సమాచారం అందుతోంది.