ఫ్రాన్స్ లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందడి పతాక స్థాయికి చేరుకుంది. భారతదేశం నుంచి ఈ వేదిక వద్దకు డజను పైగా కథానాయికలు ఆహ్వానం అందుకోవడంతో కేన్స్ కి కొత్త కళ వచ్చింది. మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్… మానుషి చిల్లర్ సహా బాలీవుడ్ నటీమణులలో ఈషా గుప్తా- సారా అలీ ఖాన్ ఈసారి కేన్స్ లో సందడి చేసారు.
ఇక ఈ వేదిక వద్ద ఈషా గుప్తా షో స్టాపర్ గా నిలిచింది. ఇషాజీ నికోలస్ జెబ్రాన్ కోచర్ గౌనులో గుండెల్ని కొల్లగొట్టింది. హిప్-హై స్లిట్ గౌనులో ఇషా ఎంతో హాట్ గా కనిపించింది. అయితే ఇషాజీతో పోటీపడుతూ మరో హాట్ బ్యూటీ దీపిక పదుకొనే సంథింగ్ స్పెషల్ డిజైనర్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది.
ఇక ఇదే వేదిక వద్ద సైఫ్ ఖాన్ కుమార్తె.. నవతరం కథానాయిక సారా అలీ ఖాన్ అబుజానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన లేస్ లెహంగా ధరించి ఎంతో ట్రెడిషనల్ గా కనిపించింది. సారా నవ్వులు విరజిమ్ముతూ ఎంతో ఆహ్లాదకరంగా అందంగా కనిపించింది.
మానుషి చిల్లర్ – దీపికా పదుకొణె వైట్ అండ్ వైట్ లుక్ లో కనిపించడం తో రాణీ హంసలు కేన్స్ లో వాలాయా? అంటూ కుర్రకారు కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు అందాల భామలు విచ్చేస్తుండడంతో రంగుల పండుగలా కలర్ ఫుల్ గా మారింది.