రామ్ చరణ్ వాచ్ ధర అన్ని కోట్లా..?

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ రామ్ చరణ్ ఉపాసనలు తల్లిదండ్రులయ్యారు. గత మంగళవారం ఈ జంట పండంటి ఆడబిడ్డ కు జన్మనిచ్చారు. ఈ జంటకు ప్రస్తుతం దేశం నలుమూలల నుంచి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. వీరి వివాహం జరిగి దాదాపు 12ఏళ్లకు బిడ్డ జన్మించడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాసన అపో లో ఆస్పత్రిలో ఈ బిడ్డకు జన్మనిచ్చారు.

కాగా ఇటీవలే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆ సమయం లో రామ్ చరణ్ స్వయంగా ఆస్పత్రికి వచ్చి తన కుమార్తె కు ఇంటికి తీసుకువెళ్లారు. ఆ సమయం లో ఆయన మీడియా తో కూడా మాట్లాడారు. బిడ్డను తన చేతుల తో అపురూపంగా ఎత్తుకొని ఆయన ఆస్పత్రి నుంచి వస్తుంటే మీడియా వారు ఫోటోలు క్లిక్ మనిపించారు. అయితే ఆ సమయంలో రామ్ చరణ్ చేతికి ఉన్న వాచ్ ఆ ఫోటోల్లో హైలెట్ గా మారింది.

కొందరు ఫ్యాన్స్ కి ఆ వాచ్ లుక్ నచ్చడంతో ధర ఎంత ఉంటుందా అని చెక్ చేశారు. దాని ధర చూసి ఇప్పుడు వారంతా షాకౌతున్నారు. ఆ వాచ్ ధర 2లక్షల డాలర్లు అట. అంటే మన భారత కరెన్సీ లో రూ. కోటి 40లక్షల కు పైచిలుకే ఉంటుందని తెలుస్తోంది. ఈ ధర చూసి అందరూ నోరెళ్ల పెడుతున్నారు. కేవలం వాచ్ ధరే రూ. కోటిన్నరా అని ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే ఆ ధరకు ఇళ్లు కూడా కొనొచ్చు తెలుసా అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.

అయితే సెలబ్రెటీలు లక్షలు కోట్లు ఖర్చు చేసి బ్రాండెడ్ దుస్తులు చెప్పులు వాచ్ లు కొనడం సర్వ సాధారణం. రామ్ చరణ్ దగ్గర ఇదొక్కటే కాదు ఖరీదైన వాచులు చాలానే ఉన్నాయి. ఆయన తనకు అన్నింటికంటే వాచ్ అంటేనే ఎక్కువ ఇష్టం అని గతం లో చెప్పిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా చరణ్ ప్రస్తుతం తన ముద్దుల కుమార్తె కోసం షూటింగ్స్ నుంచి గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ గేమ్ ఛేంజర్ షూటింగ్స్ ఫినిష్ చేసుకుంటారు. దీని తర్వాత బుచ్చిబాబుతో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.