ఇండస్ట్రీ గురువు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు వైజాగ్ సత్యానంద్. సూపర్ స్టార్లు అయినా..పాన్ ఇండియా స్టార్లు అయినా…పవర్ స్టార్ అయినా వీళ్లందర్నీ తయారు చేసిన ఘనత మాత్రం ఆయన సొంతం. ఇండస్ట్రీలో ఆయన స్కూల్ నుంచి వచ్చిన ఎంతో మంది స్టార్లు అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన శిష్యుడే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఆయన శిష్యుడే. ఇంకా చాలా మంది ఆయన తయారు చేసిన ఆయుధాలే. అందుకే నటన ఓనమాలు అంటే సత్యానంద్ పేరు తప్పక స్మరించుకుం టారు.
ఎంత గొప్ప స్టార్లు అయినా ఆయన కనిపించే సరికి ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ప్రదర్శి స్తుంటారు. తాజాగా ప్రభాస్ ఆ గురువుగారికి బంగారు కానుక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు ఖరీదైన ఓ బంగారు వాచీని పుట్టిన రోజు సందర్భంగా బహుకరించారు. నేరుగా ప్రభాస్ అన్ బాక్స్ చేసి ఆయన చేతుల మీదుగానే గురువుకు వాచీ తొడిగి తన ప్రేమ..కృతజ్ఞతని తెలియజేసారు. ఆ గోల్డ్ వాచ్ కొనడానికి చాలా కష్టపడినట్లు ఆయన మాటల్లో తెలుస్తోంది.
గురువుకి వైట్ కలర్ అంటే ఇష్టమని తెలుసుకొని ప్రత్యేకంగా అదే కలర్ తీసుకున్నారు. శిష్యుడు ఇచ్చిన వాచీని ఆయన ఎంతో సంతోషంగా స్వీకరించారు. ఇద్దరు సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. వాచీ చాలా బాగుందని డార్లింగ్ తో అన్నారు. అలాగే ఆ వాచ్ చైన్ నార్మల్ది అనుకోని పడేస్తారేమో.. అది గోల్డ్ అని చెప్పుకొచ్చారు ప్రభాస్. ఒకవేళ చైన్ టైట్ అనిపిస్తే షాప్ కి వెళ్తే ఇంకో బిట్ యాడ్ చేసి ఇస్తారని ప్రభాస్ తెలియజేశారు. అయితే ఇది ఇప్పటి వీడియో కాదు. 2021 బర్త్ డేకి సంబంధించింది.
అప్పుడు కేవలం ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి. తాజాగా వీడియో కూడా లీకైనట్లు తెలుస్తోంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ -కె..మారుతితో మరో సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. అలాగే `సలార్` రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రచారం పనుల్లోనూ బిజీ కానున్నారు.