సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్స్ కు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది అని చెప్పాలి. ఒక్క సక్సెస్ అందుకున్న కూడా స్టార్ హీరోలతో చాలా ఈజీగానే అవకాశాలు వస్తున్నాయి. అందంతోపాటు కాస్త టాలెంట్ కూడా తోడైతే ఉహించని రేంజ్ లో పారితోషకాలు అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే సినిమాల సెలెక్షన్ విషయంలో తొందరపడితే ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ అవుతోంది. ఆమధ్య ఉప్పెన సినిమాతో కృతి శెట్టి ఏ రేంజ్ లో ఎంట్రీ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కానీ ఆ తర్వాత ఆమె కొన్ని రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు చేయడంతో కెరీర్ పై ప్రభావం చూపించింది. ఇక ఇప్పుడు శ్రీ లీల సెలెక్ట్ చేసుకుంటున్న సినిమాలు, వాటి ఫలితాలను బట్టి ఆమె పరిస్థితి కూడా అలానే మారిపోతుందేమో అనేలా కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు విడుదలైన నితిన్ ఎక్స్ ట్రా సినిమాలో కూడా ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే అందులో శ్రీలీల కేవలం సాంగ్స్ కే పరిమితమైనట్లుగా కనిపిస్తోంది అని ఓ వర్గం వారు అభిప్రాయపడుతున్నారు.
శ్రీ లీల మంచి డాన్సర్ గా కూడా గుర్తింపును అందుకుంది. ఆమె అందంతోపాటు అదిరిపోయే స్టెప్పులు వేస్తే విజిల్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ధమాకా సినిమాతో సక్సెస్ లో అయితే ఆమె పాత్ర ఎక్కువగానే ఉంది. ఆ సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో వెంట వెంటనే అమ్మడికి ఆఫర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇక ఆ తరువాత మూడు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలతో చేదు అనుభవాలను మిగిల్చడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

రామ్ పోతినేని బోయపాటి కాంబినేషన్లో వచ్చిన స్కంద సినిమాలో ఆమె పాత్ర కు పెద్దగా ప్రాధాన్యత లేదు. అలాగే సినిమా ఫలితం కూడా తేడా కొట్టేసింది. ఇక తర్వాత బాలయ్య బాబుతో చేసిన భగవంత్ కేసరి సినిమాలో పరవాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఆదికేశవ మాత్రం మరింత దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అందులో ఉమ్మడి పాత్రకు అసలు ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేకపోవడం పెద్ద డ్యామేజ్.
ఇక ఇప్పుడు ఎక్స్ ట్రా సినిమాలో కూడా ఆమె క్యారెక్టర్ ఏమి కొత్తగా లేదు. కేవలం గ్లామర్ డాన్సులకు పరిమితం అయ్యేలా శ్రీలల క్యారెక్టర్లు ఉంటున్నాయి అనేలా కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క పెద్ద సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సక్సెస్ కావడమే కాకుండా అందులో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే మంచి గుర్తింపు దక్కుతుంది. లేదంటే మరో కృతిశెట్టి తరహా లోనే ఒక్కసారిగా డౌన్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ సినిమా అమ్మడికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.