అంబానీ ఇంట పెళ్లి ఖ‌ర్చు ఎన్ని కోట్లో తెలుసా?

అంబానీ ఇంట పెళ్లి అంటే శిఖ‌రం సైతం వంగి స‌లాం చేయాల్సిందే. ఆ రేంజ్ లో అంబానీ ఇంట‌ సంబ‌రాలు అంబురాన్ని అంటుతాయి. ఇండియాలో ఏ పారిశ్రామిక వేత్త‌కు సాధ్యం కాని రేంజ్ లో వేడుక‌లు సెల‌బ్రేట్ చేస్తుంటారు. ఇది కేవ‌లం అంబానీకి మాత్ర‌మే సాధ్య‌మైంద‌ని ఎన్నోసార్లు రుజువు చేసారు. ఎంతో మంది పారిశ్రామిక వేత్త‌లు ఉన్నా అంబానీ రేంజ్ లో సెల‌బ్రేష‌న్స్ మాత్రం ఎవ‌రూ నిర్వ‌హించ‌రు.

అది కేవ‌లం అంబానీకి మాత్రమే సొంతం. మ‌రి ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కోసం ఎన్నికోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు? కేవ‌లం మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ కోస‌మే 1000 మంది అతిధ‌లు తీసుకొచ్చారు? 2500 ర‌కాల వంట‌కాలు వండిస్తున్నారు? అంత‌కు ముందు గుజ‌రాతీ సంప్ర‌దాయంలో ప్ర‌త్యేక వంట‌కాలు సిద్దం చేసి ఆ కుటుంబ‌మే స్వ‌యంగా గ్రామ‌స్తుల‌కు వ‌డ్డించింది? కేవ‌లం ప్రీ వెడ్డింగ్ నే ఈ రేంజ్ లో ప్లాన్ చేసారంటే? పెళ్లిని ఇంకే రేంజ్ లో ప్లాన్ చేసి ఉండొచ్చు ఊహ‌కి కూడా అంద‌దేమో.

మ‌రి ఈ పెళ్లి కోసం అంబానీ ఎన్నికోట్లు కేటాయిస్తున్నారంటే అక్ష‌రాలా 1000 కోట్లు అని తెలిసింది. అంటే ముకేష్ అంబానీ సంప‌ద‌లో పెళ్లి ఖ‌ర్చు 0.1 శాతం మాత్ర‌మ‌ని తెలుస్తుంది. ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న మూడు రోజులు ప్రీ వెడ్డింగ్ వేడుక -పెళ్లికి కి కేటాయించిన బ‌డ్జెట్ అది అని తెలుస్తోంది. ఇంకా పెళ్లి వ‌స్త్రాలు ..షాపింగ్ ఖ‌ర్చులు కోట్ల‌లో ఉంద‌ని అంటున్నారు.

పెళ్లి రోజున అనంత్ అంబానీ బంగారం తో త‌యారు చేయించిన దుస్తుల్ని ధ‌రిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగు తుంది. అప‌ర కుబేరుడా? మ‌జాకా? అన్న రేంజ్ లోనే ఉంటుంది వేడుక‌. ఈ వివాహ వేడుక‌కు రామ్ చ‌ర‌ణ్ -ఉపాస‌న దంప‌తులు కూడా హాజ‌రవుతున్నారు. మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ లో ఆ జోడీ సంద‌డి కూడా క‌నిపించ‌నుంది.