నేచురల్ స్టార్ నాని గత ఏడాది వరుసగా రెండు సూపర్ హిట్స్ ని ఖాతాలో వేసుకొని మంచి జోరు మీద ఉన్నాడు. దసరా తో బాక్సాఫీస్ వద్ద మొదటిసారి 100 కోట్ల ను టచ్ చేసిన ఈ హీరో ఆ తరువాత హాయ్ నాన్న అంటూ కూల్ గా మరో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఇక నాని అయితే ప్రస్తుతం పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్స్ చేస్తున్నాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వెంటనే లైన్ లోకి తీసుకు వస్తున్నాడు.
ఈ ఏడాది కూడా మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకోవాలనే టార్గెట్ తో ఉన్నారు. సరిపోదా శనివారం అంటూ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. డిఫరెంట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీ సిద్ధం అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఆగష్టు 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఐదు భాషలలో రిలీజ్ కానుంది.
ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెంట్ తో నాని ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం నాని 5 నెలలు హార్డ్ వర్క్ చేసినట్లు టాక్. వీలైనంత వేగంగా సినిమా కంప్లీట్ చేయడంపై నాని దృష్టి పెట్టారు. ఇది పూర్తయిన వెంటనే మరో మూడు సినిమాలు నేచురల్ స్టార్ లైన్ లో పెట్టాడు. అందులో కొత్త దర్శకుడితో ఒక సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావొచ్చంట. అది సెట్టయితే దాన్ని కూడా 5 నెలల్లోనే ఫినిష్ చేయవచ్చు.
అలాగే సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాణంలో పాన్ ఇండియా మూవీ ఒకటి చేయనున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీతోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఓజీ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందంట. ఈ సినిమా కోసం కూడా నాని మూడు నెలల డేట్స్ మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది.
బలగం సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే మూవీ నాని చేయబోతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాని ఎనౌన్స్ చేశారు. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందంట. అయితే దీని కోసం 6 నెలల టైమ్ పట్టే ఛాన్స్ ఉందని సమాచారం. పీరియాడికల్ జోనర్ లో మూవీ కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది.
ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలని నాని లైన్ లో పెట్టడమే కాకుండా షూటింగ్ లు కూడా వెంటవెంటనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడంట. ఏడాదికి కనీసం రెండు సినిమాలు ప్రేక్షకులకి అందించాలని నాని టార్గెట్ గా పెట్టుకున్నట్లు టాక్. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మూడు సినిమాలని ఒకే చేసినట్లు తెలుస్తోంది. సరిపోదా శనివారం మూవీ కంప్లీట్ అయిన వెంటనే సుజిత్ మూవీ లేదంటే ఎల్లమ్మ స్టార్ట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.