బాలీవుడ్ విలక్షణ నటుల్లో ఒకరైన నవాజుద్ధీన్ సిద్ధిఖీ తను చేసే ఎలాంటి పాత్ర అయినా సరే తన ప్రత్యేకత చూపుతూ సత్తా చాటుతాడు. ఆమధ్య బాలీవుడ్ లో ప్రతి సినిమాలో నవాజుద్ధీన్ సిద్ధిఖీ నటించారు. ఐతే అతనిలోని ఈ స్పెషల్ క్వాలిటీ వల్ల ఎలాంటి పాత్రకైనా సరే అతను అట్టే అతికినట్టు సరిపోతున్నారు. అందుకే ఆయనను సినిమాలో కన్నా ఈమధ్య ఎక్కువగా వెబ్ సీరీస్ లకు తీసుకుంటున్నారు. ఇప్పుడు కాదు దాదాపు 3, 4 ఏళ్లుగా ఆయన బాలీవుడ్ లో ఒక్కటంటే ఒక్క సినిమా చేయలేదు.
ఐతే ఈ ఇయర్ మొదట్లో తెలుగులో విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమాలో నటించాడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన సైంధవ్ హిట్ అయితే తెలుగులో కూడా నవాజుద్ధీన్ కి వరుస అవకాశాలు వచ్చేవి కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆయన్ను పట్టించుకోలేదు. కామెడీ, విలనిజం పాత్రలే కాదు డైరెక్టర్ రాసుకున్న ఎలాంటి టిపికల్ రోల్ అయినా తన అభినయంతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడు నవాజుద్ధీన్ అందుకే బాలీవుడ్ లో ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది.
నవాజుద్ధీన్ సిద్ధిఖీ లేటెస్ట్ గా నటించిన ప్రాజెక్ట్ రౌతు కా రాజ్. ఇది జీ 5 లో రిలీజైన. ఈ సీరీస్ తో మరోసారి తన స్పెషాలిటీ చూపించారు నవాజుద్ధీన్. ఈ కథ విన్నప్పుడే ఇందులో తన పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని ఫిక్స్ అయ్యానని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రౌతు కా రాజ్ లో నవాజుద్ధీన్ సిద్ధిఖీ ఇన్ స్పెక్టర్ దీపక్ సింగ్ పాత్రలో నటించారు. తన పాతికేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని అంటున్నారు నవాజుద్ధీన్ సిద్ధిఖీ.
ఇక ఈమధ్య సిల్వర్ స్క్రీన్ లో కన్నా ఓటీటీలోనే ఎక్కువ కనిపిస్తున్నారన్న దానికి స్పందిస్తూ.. ప్రపంచం మొత్తం ఓటీటీల హవా నడుస్తుంది. వచ్చే ప్రాజెక్ట్ లు కూడా అక్కడే వస్తునాయని అన్నారు. ఇక కెరీర్ లో ఫస్ట్ టైం హడ్డీ సినిమా కోసం ట్రాన్స్ జెండర్ రోల్ చేస్తున్నానని. ఇప్పటివరకు చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తైతే అది ఒకెత్తు అంటున్నారు నవాజుద్ధీన్ సిద్ధిఖీ. కెరీర్ లో రిస్క్ చేయడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని.. అలా రిస్క్ చేసినప్పుడే ప్రేక్షకులకు దగ్గరవుతామని అంటున్నారు నవాజుద్ధీన్.