ప్రశాంత్ వర్మ పవర్ఫుల్ లైనప్.. కానీ ఏది ముందు?

హనుమాన్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ వర్మ నెక్స్ట్ లైన్ అప్ లో పెద్ద ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తున్నారు. అయితే వీటిలో ఏది ముందు మొదలుపెడతాడనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాని ఇప్పటికే ప్రశాంత్ వర్మ స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రకి స్టార్ హీరోని తీసుకోవాలని అనుకుంటున్నారు.

ఆయన మైండ్ లో ఉన్న స్టార్ హీరోలు అయితే ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. వారు డేట్స్ అడ్జస్ట్ చేసి ఉంటే ఈపాటికే జై హనుమాన్ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేసేవాడు. క్యాస్టింగ్ ఖరారు కాకపోవడంతో ఈ సినిమా అప్డేట్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ బాధ్యతని నందమూరి బాలకృష్ణ ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారు. ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రశాంత్ వర్మ రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ స్టోరీలైన్ రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అభిమాన్యుడి క్యారెక్టర్ బేస్ చేసుకొని సూపర్ హీరో కథగానే ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమాని చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉందంట. ఈ సినిమాకి నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని తర్వాత డివివి దానయ్య నిర్మాణంలో దానయ్య తనయుడు దాసరి కళ్యాణ్ హీరోగా అధీరా అనే సినిమాని ఏడాది క్రితమే ఎనౌన్స్ చేశారు.
ఇది సూపర్ హీరో మూవీగానే తెరకెక్కనుంది. నిజానికి హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ అధీరా సినిమాని స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

అయితే ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ బాధ్యత తనమీద ఉండటంతో అధీరా దర్శకత్వం తన అసిస్టెంట్ కి అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో ప్రశాంత్ వర్మ కూడా భాగస్వామ్యం కాబోతున్నారంట. ఈ భారీ ప్రాజెక్ట్స్ అన్నిటినీ ప్రశాంత్ వర్మ బ్యాక్ టూ బ్యాక్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాలకి సంబందించిన అప్డేట్స్ గురించి అయితే ప్రశాంత్ వర్మ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

జై హనుమాన్ ముందు స్టార్ట్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు. అయితే తరువాత దానిని హోల్డ్ లో పెట్టి రణవీర్ సింగ్ తో సూపర్ హీరో మూవీస్ ప్లాన్ చేశారు. అది క్రియేటివ్ డిఫరెన్స్ వలన ఆగిపోయింది. తరువాత జై హనుమాన్ స్టార్ట్ చేస్తారని అనుకుంటే హీరో సెట్ అవ్వలేదు. ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ స్టార్ట్ చేస్తాడని టాక్ ఉన్న ప్రకటన రాలేదు.