మ్యాన్ ఆఫ్ మాసెస్ తార‌క్ భార్య‌తో `ఏసీ` గొడ‌వ‌!

ఇంట్లో భార్య‌ల్ని ఎలా మ్యానేజ్ చేయాలో తెలియాలంటే? ఈ హీరోల్ని ఫాలో అయితే స‌రిపోతుంది. అవును చిరంజీవిని చూసి చ‌ర‌ణ్ నేర్చుకున్నాడు. భార్య‌ల విష‌యంలో కాస్త త‌గ్గి ఉండ‌టం..జాగ్ర‌త్త‌గా ఉండ‌టం… భ‌య‌ప‌డిన‌డిన‌ట్లు ఉంటే చాలు. ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని చ‌ర‌ణ్ ఓ సంద‌ర్భంలో అన్నారు. ఈ విష‌యాన్ని చ‌ర‌ణ్ త‌న తండ్రిని చూసి నేర్చుకున్న‌ట్లు తెలిపారు.

ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని అడిగితే? ఏం లేదు? ఎప్పుడూ న‌వ్వుతూ సంతోషంగా వాళ్ల‌కు క‌నిపిస్తే చాలు మ్యానేజ్ అయిపోతారు. ఆ త‌ర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌న్నారు. అలా చిరు..చ‌ర‌ణ్‌..మ‌హేష్ లు వ్య‌క్తిగ‌త జీవితంలో సంతోషంగా సాగిపోతున్నారు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి ముందు ఇలాంటి ప్ర‌శ్న వెళ్ల‌లేదుగానీ…ఆయ‌న భార్య గురించి ఓ ప్ర‌శ్న వెళ్లింది.

`దేవ‌ర` ప్ర‌మోష‌న్ లో భాగంగా నెట్ ప్లిక్స్ క‌పిల్ శ‌ర్మ షోలో తార‌క్, జాన్వీ, సైఫ్ అలీఖాన్ పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్యక్రమంలో అర్చన పురాణ్ సింగ్ ఎన్టీఆర్ ని ఇలా అడిగారు. ఇంట్లో భార్య( ల‌క్ష్మి ప్ర‌ణ‌తి) తో గొడవ‌కు దారితీసిన చిన్న సమస్య గురించి ఎన్టీఆర్‌ని అడిగారు. ఎన్టీఆర్ వెంటనే ‘ఏసీ’ అని బదులిచ్చారు. ఎయిర్ కండిషనింగ్ విషయంలో తనకు- తన భార్యకు మ‌ధ్య తరుచూ గొడవలు జరుగుతుంటాయని వివరించారు.

ఈ విషయంలో తాను రాజీపడబోనని, ఈ వాదనలో తానెప్పుడూ గెలుస్తానని చెప్పిన ఎన్టీఆర్ చెప్పారు. ప్ర‌ణ‌తి సౌమ్యురాలు…గొడ‌వ‌లు ప‌డ‌టం వంటి వాటి జోలికి వెళ్ల‌ద‌ని..తానంతా కామ్ గా ఉంటుంద‌న్నారు. చిన్న చిన్న విష‌యాల‌కు గొడ‌వ‌లు సృష్టించ‌దు అన్నారు. ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ కి సంబంధించిన విష‌యాలేవి బ‌య‌ట‌కు పెద్ద‌గా రావు. తార‌క్ ఇంట్లో ఎంతో స‌ర‌దాగా ఉంటారు. ఎక్కువ‌గా ఆయ‌న కిచెన్ గ‌దిలోనే ఉంటారు. అది త‌ప్పితే పిల్ల‌ల‌తో ఆడుకోవ‌డం.. ఇలా టైంపాస్ చేస్తుంటారు.