గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘RC 16’ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ జోనర్ లో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు చాలా గ్యాప్ తీసుకొని ఈ చిత్రాన్ని చేస్తున్నారు. దీంతో మూవీ పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ కన్ఫర్మ్ అయ్యింది. ఇదిలా ఉంటే చాలా ఏళ్ళ తర్వాత ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారు. మూవీ కథ రెహమాన్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యిందంట. అందుకే వెంటనే ఈ సినిమా చేయడానికి రెహమాన్ ఒకే చెప్పేసాడని టాక్. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.
రెహమాన్ ఇప్పటికే ఈ మూవీ కోసం 4 అదిరిపోయే సాంగ్ ట్యూన్స్ సిద్ధం చేసారంట. బుచ్చిబాబు స్క్రిప్ట్ ని చాలా క్లారిటీగా రెహమాన్ కి నేరేట్ చేయడంతో కథకి కావాల్సిన సాంగ్స్ ట్యూన్స్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇంకా ఈ మూవీ షూటింగ్ మొదలు కాకముందే సాంగ్స్ పరంగా రెహమాన్ తన పని పూర్తి చేసాడనే మాట వినిపిస్తోంది. అన్ని కరెక్ట్ గా కుదిరితే బుచ్చిబాబు కూడా సాంగ్ షూట్ తోనే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఎవరు నటిస్తారనే ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ ప్రస్తుతం మేకోవర్ అవుతున్నారు. లుక్ రెడీ అవ్వగానే షూటింగ్ మొదలు పెట్టనున్నారంట. షూటింగ్ కి కావాల్సిన సెట్ వర్క్స్ కూడా ప్రస్తుతం పూర్తి చేసే పనిలో ఉన్నారని టాక్ నడుస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఇందులో అతని క్యారెక్టర్ కాస్తా హ్యూమర్ టచ్ తో ఉంటుందని గతంలో ఓ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో చరణ్ చెప్పాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో కథ కావడంతో డైలాగ్స్ కూడా అక్కడి నేటివ్ స్లాంగ్ లో ఉంటాయనే మాట వినిపిస్తోంది. గేమ్ చేంజర్ మూవీ కంటే RC16 పైన మెగా ఫ్యాన్స్ లో ఎక్కువ ఆసక్తి ఉండటం విశేషం.