‘పుష్ప 2’ ట్రైలర్ విడుదల అనంతరం సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై ఉన్న అంచనాలని ట్రైలర్ నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్ళింది. సుకుమార్ విజన్ ఈ ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. అలాగే అల్లు అర్జున్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా మాస్ రాంపేజ్ లా ఉండబోతోందని ట్రైలర్ చూసిన తర్వాత బన్నీ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కచ్చితంగా పుష్పరాజ్ మరోసారి పూనకాలు తెప్పిస్తాడని అనుకుంటున్నారు.
కచ్చితంగా ఇది 2000 కోట్ల కలెక్షన్స్ చిత్రం అంటూ అప్పుడే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 1000 కోట్ల క్లబ్ లో చాలా ఈజీగా ఈ చిత్రం చేరిపోతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే థమన్ కూడా ‘పుష్ప 2’ బ్యాగ్రౌండ్ స్కోర్ పైన వర్క్ చేస్తున్నానని కన్ఫర్మ్ చేశాడు.
అలాగే అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం పని చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ట్రైలర్ లో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెబుతాడు. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటాడు. ఆ డైలాగ్ కి తగ్గట్లుగానే సుకుమార్ ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ లెవల్ లో అందరికి రీచ్ చేయాలనే లక్ష్యంతోనే బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం ఎక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నాడని అనుకుంటున్నారు.
ఏది ఏమైనా ‘పుష్ప 2’ కోసం ఇలా మల్టీపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయడం నిజంగా ఆసక్తికర విషయమని చెప్పాలి. ఈ మూవీకి వారందరూ అందించిన మ్యూజిక్ వర్క్ అవుట్ అయితే మాత్రం కచ్చితంగా దానిని భవిష్యత్తులో మిగిలిన దర్శకులు ఫాలో అయ్యే అవకాశం ఉంది. అయితే ‘పుష్ప 2’ ట్రైలర్ కి మాత్రం దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే మ్యూజిక్ అందించినట్లు టైటిల్ క్రెడిట్స్ బట్టి అర్ధమవుతోంది. ట్రైలర్ కి దేవిశ్రీ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
‘పుష్ప’ కంటే బెస్ట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ‘పుష్ప 2’ ట్రైలర్ కి ఇచ్చాడనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో కూడా మేజర్ క్రెడిట్ దేవిశ్రీ ప్రసాద్ దే ఉండొచ్చని అనుకుంటున్నారు. మరి సుకుమార్ ఎలాంటి ప్లాన్ తో ఈ సినిమా అవుట్ ఫుట్ ని రెడీ చేస్తున్నాడు, అది ఎంత వరకు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.