అభిజీత్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగ్… గేట్స్ ఓపెన్!

బిగ్ బాస్ సీజన్ 4 లో అభిజీత్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపిస్తున్నాడు. చాలా మంది బయట అభిజీత్ బిగ్ బాస్ 4 విన్నర్ అయ్యే అవకాశాలను తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు బిగ్ బాస్ లో నాగార్జున అభిజీత్ కు గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అభిజీత్ మొన్న జరిగిన జలజ దెయ్యం టాస్క్ లో సరిగ్గా పాల్గొనకపోవడమే దీనికి కారణం.

జలజ దెయ్యం టాస్క్ లో ఒక్కొక్కరికీ ఒక్కో టాస్క్ ను ఇచ్చింది బిగ్ బాస్. మోనాల్ ను ఏడిపించిన కారణంగా అభిజీత్, అఖిల్ లలో ఎవరో ఒకరిని మోనాల్ ను డేట్ కు తీసుకెళ్లమని చెప్పారు. ఈ విషయంలో అభి ఎమోషనల్ అయ్యాడు. మోనాల్ టాపిక్ వస్తుంటే తనకే రివర్స్ కొడుతోందని ఫీలయ్యాడు. ఎప్పుడూ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకునే అభిజీత్ కూడా ఏడ్చినంత పని చేసాడు.

ఈ టాపిక్ మీదే అభిజీత్ కు ఈరోజు అక్షింతలు పడ్డాయి. బిగ్ బాస్ టాస్క్ చెబితే చెయ్యవా అంటూ నాగార్జున ఫైరయ్యాడు. దానికి నేను మోనాల్ ను ఏడిపించలేదు అని అనగానే దానికి సంబంధించిన వీడియోను ప్లే చేసాడు. అభి సారీ చెబుతుంటే ప్రతీసారి నువ్వు ఇదే చేస్తున్నావు, గేట్స్ ఓపెన్ అని వార్నింగ్ ఇచ్చాడు. చూడాలి మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో.