అచ్చెనాయుడు ఆరోగ్య పరిస్థితి విషమం

తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి అచ్చెనాయుడును ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్యా గుంటూరు జీజీహెచ్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడు. ఆయనకు కొన్ని రోజుల క్రితం ఆపరేషన్‌ జరిగింది. అది మళ్లీ తిరగబెట్టడంతో రక్తస్రావం అవుతున్నట్లుగా వైధ్యులు ఇటీవలే పేర్కొన్నారు. మళ్లీ ఆయన హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన వైధ్యులు ఆయన పరిస్థితి కాస్త విషమంగానే ఉందన్నారు.

ఆయన రక్తపోటు ఎక్కువగా నమోదు అవుతుంది. అలాగే ఆయన కాళ్లు మరియు చేతులు పదే పదే తిమ్మిరి ఎక్కుతున్నట్లుగా వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అచ్చెనాయుడుకు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికి అప్పుడు ప్రభుత్వంకు తెలియజేస్తున్నట్లుగా కూడా జీజీహెచ్‌ హాస్పిటల్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అచ్చెనాయుడు ఆరోగ్య పరిస్థితిపై తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.