ఆచార్య చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా వచ్చే వేసవిలో విడుదల చేసేసి తీరాలని కొరటాల శివ భావిస్తున్నాడు. అయితే ఇంతవరకు నలభై శాతమే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. చిరంజీవి నవంబర్ నుంచి షూటింగ్‌కి వచ్చేస్తారని కొరటాల శివ నమ్ముతున్నాడు. ఆయన వచ్చేస్తే నవంబర్ నుంచి ఏకబిగిన ఫిబ్రవరి వరకు షూటింగ్ చేసి, మార్చిలో పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుని, ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
ఏప్రిల్ 9 అయితే ఈ చిత్రానికి బెస్ట్ డేట్ అని కొరటాల శివ భావిస్తున్నాడట. ఒకవేళ అది మిస్ అయితే మే 7కి ప్లాన్ చేసుకోవచ్చునని ఈ రెండు డేట్లను టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే అప్పటికి సినిమా వచ్చేదీ లేనిదీ నవంబర్‌లో షూటింగ్ మొదలవుతుందా లేదా అనే దానిపై ఆధారపడి వుంటుంది.
పైగా ఈ చిత్రానికి చరణ్‌తో లింక్ వుంది. చరణ్‌కి ఇంకా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర చేయడానికి రాజమౌళి నుంచి క్లియరెన్స్ రాలేదు. ఒకవేళ డిసెంబర్ నాటికి అయినా షూటింగ్ మొదలు కాకపోతే మాత్రం వేసవిలో ఆచార్య రిలీజ్ చేయడం కష్టమవుతుంది. అప్పుడు మళ్లీ జులై లేదా ఆగస్ట్ లో మంచి డేట్ ఏదైనా చూసుకోవాలి.