ఆచార్య భలే భలే బంజారా: సూపర్బ్ డ్యాన్స్ నెంబర్

ఆచార్య నుండి సూపర్బ్ డ్యాన్స్ నెంబర్ విడుదలైంది. ఏప్రిల్ 29న ఆచార్య చిత్రం విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను షురూ చేసారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే.

ఇక ఇప్పుడు చిత్రంలోని భలే భలే బంజారా సాంగ్ ను రిలీజ్ చేసారు. రామ్ చరణ్, చిరంజీవి మధ్య ఈ సాంగ్ ను చిత్రీకరించడంతో మెగా ఫ్యాన్స్ కు ఇది సూపర్బ్ ట్రీట్ అని చెప్పవచ్చు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ కు ఇద్దరూ పోటీ పడి నర్తించారు.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం కూడా సాంగ్ కు ప్లస్ అయిందనే చెప్పవచ్చు. ఇక శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఈ సాంగ్ ను మంచి ఎనర్జీతో ఆలపించారు. మణిశర్మ ఇచ్చిన ట్యూన్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా అనిపిస్తోంది. మొత్తంగా మెగా ఫాన్స్ లో కొత్త జోష్ నింపుతోంది ఈ సాంగ్.