రెండో పెళ్లి, ఆరోగ్యంపై వస్తోన్న వార్తలపై స్పందించిన ప్రేమ

ఇండస్ట్రీలో హీరోయిన్లకు కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎంత వేగంగా స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంటారో అంతే వేగంగా వారు హీరోయిన్ గా అవకాశాలను కోల్పోతారు. చాలా కొద్ది మంది మాత్రమే దశాబ్ద కెరీర్ ను రీచ్ అవుతారు. సీనియర్స్ అయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి, వదిన, అక్క పాత్రలకు సెటిల్ అవుతారు.

హీరోయిన్ ప్రేమ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది. విక్టరీ వెంకటేష్ సరసన ధర్మచక్రం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రేమకు దేవి చిత్రం పెద్ద బ్రేక్ ను ఇచ్చింది. ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూసింది లేదు. వరసగా తెలుగు, కన్నడ, తమిళ్ చిత్రాల్లో నటించింది.

ప్రేమ వ్యక్తిగత జీవితం గురించి ఇటీవలే రూమర్స్ వచ్చాయి. 2006లో జీవన్ అప్పచ్చు అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమ తర్వాత ఆయన నుండి విడాకులు తీసుకుంది. అలాగే తన రెండో పెళ్లిపై వస్తోన్న రూమర్స్ ను కొట్టిపారేసింది. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉంటున్నట్లు తెలియజేసింది. తనకు గతంలో క్యాన్సర్ సోకిందని, దాన్ని జయించి తాను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపింది.