ఆరెక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతి తన రెండో సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మహా సముద్రం అనే కథను రాసుకుని దాదాపు ఏడాది పాటు హీరోల వేట కొనసాగించాడు. ఇద్దరు హీరోలు ఉన్న మల్టీస్టారర్ కథ ఇది. అయితే కారణాలు తెలియదు కానీ చాలా మంది ఈ చిత్రాన్ని చేయడానికి సముఖత వ్యక్తం చేయలేదు. ఒకానొక సందర్భంలో ఈ విషయంపై అజయ్ భూపతి అసహనం వ్యక్తం చేసాడు కూడా.
చివరిగా శర్వానంద్, సిద్ధార్థ్ లు ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేయడానికి కన్ఫర్మ్ అయ్యారు. ఇక దాని తర్వాత హీరోయిన్ విషయంలో నెలకొన్న సస్పెన్స్ కు కూడా ఇప్పుడు తెరపడింది. అదితి రావు హైదరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఆమె ఇటీవలే వి చిత్రంలో నాని సరసన నటించిన విషయం తెల్సిందే. ఆమె పాత్ర చిన్నదైనా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
శర్వానంద్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు పూర్తైన తర్వాత మహా సముద్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ కు వెళుతుందని అంటున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.
Welcoming the Fantastic Performer who perfectly fits into the lead role of my film, Princess @aditiraohydari on board 🙏😇
I'm so fortunate to have so perfect cast in our #MahaSamudram 🌊@ImSharwanand @Actor_Siddharth @AnilSunkara1 @AKentsOfficial pic.twitter.com/5fd3AWdksa
— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 12, 2020