కోవిడ్ నియమనిబంధనల ప్రకారం .. పరిమిత సిబ్బంధితోనే అనుకూలంగా షూటింగ్ చేయగలరు. ఈ ఫార్మాట్ లో ఆర్జీవీ స్పెషలిస్ట్. ఆయన తరహాలోనే పలువురు అగ్ర దర్శకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని కథనాలొస్తున్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పరిమిత నటీనటులు సిబ్బంధితో సినిమాలు తీయడం మలయాళీలకు కోవిడ్ కంటే ముందే ఉన్న అలవాటు. ఇప్పుడు అదే బాటలో మరింతగా అక్కడ సినిమాలు తెరకెక్కుతున్నాయి. పరిమిత బడ్జెట్లతో ఓటీటీ తరహా సినిమాలకు కొదవేమీ లేదు. తాజా సమాచారం ప్రకారం 18+ అనే మలయాళ చిత్రం పరిమిత సిబ్బంధితో తెరకెక్కనుందిట. ఇందులో నటీనటులంతా 20లోపు వారే. 15 మంది సభ్యులతో సెట్స్ కెళతారట. సెప్టెంబర్ 4 నుంచి చిత్రీకరణకు సిద్ధమవుతున్నారు. మిధున్ జ్యోతి ఈ ప్రాజెక్టుకు కర్త అని తెలిసింది.
థ్రిల్లర్ కాన్సెప్టుతో తెరకెక్కనున్న ఈ సినిమాని త్రివేండ్రంలో ఓ భవంతి ఆ చుట్టు పక్కల పరిసరాల్లో తెరకెక్కించనున్నారు. ఒకే పాత్రతో సినిమాలు తీయడం.. లేదా నాలుగైదు పాత్రలతో సినిమాలు తీయడం అన్నది చాలాకాలంగా ఉన్నదే. అయితే లాక్ డౌన్ పీరియడ్ లో ఇలాంటి జోనర్ సినిమాల చిత్రీకరణకు అనుకూలం. ఇంకో ఏడాది పాటు తెలివైన నిర్మాతలు ఈ తరహాలోనే ప్లాన్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల ఆర్జీవీ చేస్తున్న హడావుడి చూసి చాలా మంది ఔత్సాహిక నిర్మాతలు పరిమిత సిబ్బంధితో వేగంగా తెలివైన కథాంశాల్ని ఎంచుకుని సినిమాలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.