నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుని 2021 సంవత్సరపు టాప్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈమద్య కాలంలో ఎక్కువ శాతం సినిమాలు ఒక వారం లేదా రెండు వారాలు వసూళ్లను దక్కించుకుంటున్నాయి.
మూడవ వారంలో వసూళ్లు నమోదు చేస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నట్లే. తాజాగా విడుదల అయిన అఖండ సినిమా రెండవ వారంతో పాటు మూడవ వారంలో కూడా భారీ వసూళ్లను దక్కించుకుంటూ దూసుకు పోతుంది. తాజాగా పుష్ప సినిమా విడుదల అయ్యింది. అయినా కూడా అఖండ సినిమాకు పలు చోట్ల మంచి షేర్ నమోదు అవుతున్నట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మూడవ వారంలో థియేటర్లలో ఉండటమే చాలా పెద్ద విషయం. అలాంటిది అఖండ సినిమా మూడవ వారంలో కూడా జనాలను థియేటర్లకు రాబట్టుతుంది అంటే బాలయ్య.. బోయపాటి గట్టిగానే కొట్టినట్లుగా భావించవచ్చు. వీరిద్దరికి ఇది హ్యాట్రిక్ మూవీ.
భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన అఖండ సినిమా కు వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు అవ్వడం.. అది కూడా ఇలాంటి కరోనా సమయంలో ఇంత భారీ వసూళ్లు నమోదు అవ్వడం చూస్తుంటే బాలయ్య మళ్లీ మునుపటి జోరు కంటిన్యూ అవ్వబోతుందనే ఆనందం అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. భారీ వసూళ్లు నమోదు చేసిన అఖండ సినిమా బాలయ్య స్టామినా ఏంటీ అనేది నిరూపించిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిశ్రమ స్పందన దక్కించుకుని కూడా భారీ వసూళ్లను దక్కించుకుంటుంది. పుష్ప భారీ వసూళ్ల సమయంలో కూడా అఖండ సినిమా వసూళ్లు కొనసాగడం చూస్తుంటే తెలుగు సినిమా లకు మునుపటి వైభవం వచ్చినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అఖండ వంటి భారీ విజయాన్ని నమోదు చేసిన బాలయ్య తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోతున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో కూడా బాలయ్య ఒక సినిమాను చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా బాలయ్య కు ఘన విజయాన్ని కట్టబెట్టె అవకాశాలు ఉన్నాయని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. మరో వైపు బాలయ్య అన్ స్టాపబుల్ తో ఓటీటీ ప్లాట్ ఫామ్ పై దూసుకు పోతున్నాడు.