అన్నీ సజావుగా వుండి వుంటే ఈ పాటికి ఎఫ్ 3 సినిమా సెట్ మీద వుండి వుండేది. కానీ ఏం చేస్తాం..కరోనా వచ్చి మొత్తం మార్చేసింది. మరో నెల తరువాత అయినా షూటింగ్ లు మొదలైనా, వెంకీ ఎఫ్ 3 ప్రాజెక్టు మీదకు రావడానికి ఇంకా టైమ్ పడుతుంది. అలాగే వరుణ్ తేజ్ కూడా. అందుకే ఈలోగా ఓ మీడియం సినిమా లాగించేసే ఆలోచన ఇటు అనిల్ రావిపూడిలోనూ, అటు దిల్ రాజు లోనూ వున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
అయితే నవంబర్, డిసెంబర్ నాటికి దొరికే హీరో ఎవ్వరు? అందరూ బ్యాక్ లాగ్ లు పూర్తి చేస పనిలో వుంటారు. అయితే బ్యాచులర్ సినిమా తరువాత ఇంకా ఏదీ పక్కాగా కమిట్ కాలేదు హీరో అఖిల్. ఇటీవల సురేందర్ రెడ్డి పేరు వినిపించింది. కానీ ఇంకా ఫైనల్ అయినట్లు లేదు. దిల్ రాజుకు కూడా ఎప్పటి నుంచో అఖిల్ తో ఓ సినిమా చేయాలని వుందని తెలుస్తోంది.
అందువల్ల అన్నీ కుదిరితే అనిల్ రావిపూడి-అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో ఓ సినిమా సెట్ అయినా ఆశ్చర్యం లేదు. వెయిట్ అండ్ సీ..