న్యూ ఇయర్ పార్టీ… అర్ధరాత్రి రచ్చ చేసిన మోనాల్, అఖిల్

ప్రేమజంటగా బిగ్ బాస్ లో గుర్తింపు పొందారు అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్. ఏమాత్రం అంచనాలు లేకుండా షో లోకి అడుగుపెట్టిన ఈ ఇద్దరూ ఫస్ట్ నుండే కనెక్ట్ అయ్యారు. 14 వారాల పాటు బిగ్ బాస్ లో వీరి ప్రయాణం భలేగా సాగింది. ఇద్దరూ లవర్స్ లానే చట్టాపట్టలేసుకుని బిగ్ బాస్ లో తమ ప్రయాణాన్ని కొనసాగించారు.

మోనాల్ 14వ వారం హౌజ్ నుండి బయటకు వచ్చేయగా అఖిల్ సార్థక్ బిగ్ బాస్ సీజన్ 4 రన్నరప్ గా నిలిచాడు. హౌజ్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి ప్రయాణం కొనసాగుతోంది. మోనాల్ ఎలిమినేట్ అయిన తర్వాత అఖిల్ తరుపున ప్రచారం చేసింది. తనకు ఓటు వేయమని అడిగింది.

అలాగే రీసెంట్ గా అర్ధరాత్రి అఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేసింది. ఇదంతా కాకుండా ఇప్పుడు వీళ్ళు న్యూ ఇయర్ పార్టీ కోసం కలిశారు. న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా అఖిల్, మోనాల్ లతో పాటు సోహైల్ కూడా కలిసి ఎంజాయ్ చేసారు. సోహైల్ ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసాడు.