అఖిల్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్?

అఖిల్ అక్కినేని ఇంకా తన కెరీర్ లో మొదటి విజయాన్ని అందుకోలేదు కానీ ప్రామిసింగ్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ షూటింగ్ పూర్తి చేసాడు అఖిల్ అక్కినేని. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ తర్వాత స్టైలిష్ టేకింగ్ దర్శకుడు సురేందర్ రెడ్డితో సినిమాకు కమిటైన విషయం తెల్సిందే. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించనున్నాడట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.