హీరోగా పరిచయం కాకముందే స్టార్ మెటీరియల్ అనిపించుకున్న అక్కినేని అఖిల్ తన తొలి సినిమా మొదటి రోజు వసూళ్లతో నిజంగానే తనకున్న ‘పుల్’ ఏమిటో చూపించాడు. కానీ చాలా అరుదుగా మిస్‌ఫైర్ అయ్యే వినాయక్ ‘అఖిల్’ చిత్రానికి దారుణంగా ఫెయిలవడంతో అఖిల్‌కి ఫస్ట్ అటెంప్ట్‌లో బ్యాడ్ రిజల్ట్ తప్పలేదు.
హలో చిత్రానికి నాగార్జున అన్నీ జాగ్రత్తగా సెట్ చేసినా కానీ రిలీజ్ టైమింగ్ కుదరలేదు. భారీగా ఖర్చు పెట్టిన ఆ చిత్రం ఫెయిలవడంతో అఖిల్ మూడవ ప్రయత్నం ‘మిస్టర్ మజ్ను’పై ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమా బాగానే వున్నా కానీ ప్రేక్షకులని థియేటర్లకు రాబ్టలేదు.
దీంతో వరుస విజయాలు అందిస్తున్న బన్నీ వాస్ నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చేస్తున్నాడు.
ఈ సినిమా కోసం అన్నీ పర్‌ఫెక్ట్‌గా సెట్ చేసుకున్నారు. ప్రస్తుతం టాప్‌లో వున్న పూజ హెగ్డేని కథానాయికగా తీసుకున్నారు. పీక్ సమ్మర్‌లో రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ కలల సౌధాలను కరోనా కలకలం కూల్చేయడంతో ఇప్పుడు మళ్లీ అలాంటి సెట్టింగ్ కోసం చూస్తున్నారు.
ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ వుంది కనుక అది పూర్తి చేసి సంక్రాంతికి రావాలని భావిస్తున్నారు. అయితే సంక్రాంతికి వచ్చే మిగతా సినిమాలను బట్టి ఈ చిత్రానికి డేట్ డిసైడ్ అవుతుంది.
ఒకవేళ సంక్రాంతి మిస్ అయితే సమ్మర్ వరకు ఎదురు చూస్తారా లేక ఏదైనా ఆఫ్ సీజన్‌లో రిలీజ్ చేసేస్తారా? ఇప్పటికైనా అఖిల్‌పై అదృష్ట లక్ష్మి దయ చూపుతుందా?