అమెరికాలో బ్యాచిలర్ అఖిల్ బెటర్ మెంట్

సెకండ్ వేవ్ అనంతరం వరుసగా సినిమాలు రిలీజవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కంటెంట్ ఉన్న సినిమాలు ఆడాయి. విదేశాల నుంచి రిపోర్ట్ పాజిటివ్ గానే ఉంది. ముఖ్యంగా అమెరికాలో` చక్కని వసూళ్లు సాధించిన సినిమాలేవీ? అన్నది ఆరా తీస్తే..

నాగచైతన్య- శేఖర్ కమ్ముల మూవీ `లవ్ స్టోరి` ఓవర్సీస్ లో బాక్సాఫీస్ వద్ద సేఫ్ జోన్ కి చేరుకుందని కథనాలొచ్చాయి. ఈ చిత్రం 1.3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దసరా వారాంతంలో ఓవర్సీస్ బాక్సాఫీస్ లెక్కలు తాజాగా రివీలయ్యాయి. ఇందులో అఖిల్ అక్కినేని నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మొదటి వారాంతంలో 450 కె డాలర్లు (సుమారుగా) వసూలు చేసింది. హలో కాకుండా అఖిల్ అక్కినేని నటించిన రెండవ అతిపెద్ద కలెక్షన్ ఇదని తెలిసింది. బ్యాచిలర్ గా అఖిల్ నటనతో పాటు పూజా హెగ్డే బ్రిలియంట్ పెర్ఫామెన్స్ గ్లామర్ ఈ సినిమా విజయానికి సాయపడ్డాయి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అమెరికా వసూళ్లను పరిశీలిస్తే.. శుక్ర వారం 228 కె డాలర్లు.. శనివారం- 142 కె డాలర్లు.. ఆదివారం 70 కె డార్లు సుమారు వసూలైంది. ఓవరాల్ గా 3రోజుల మొత్తం 450 కె డాలర్లు వసూలైంది. పెళ్లి సంద-డి- మహాసముద్రం విదేశీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. శివకార్తికేయన్ డాక్టర్ చక్కని వసూళ్లను సాధించిందని తెలిసింది. పెళ్లి సందడి తెలుగు రాష్ట్రాల్లో ఫర్వాలేదనిపించినా విదేశీ వసూళ్లు నిరాశపరిచిందని రిపోర్ట్ అందింది.