ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూసింది. ఎట్టకేలకు కరోనా వినియోగంకు పలు దేశాలు అనుమతులు ఇచ్చాయి. ఇండియాలో కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగంకు అనుమతులు వచ్చాయి. దాంతో అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా 10 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ సమయంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు.
బీజేపీ ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సిన్ ను ఎలా నమ్మాలి. తమ ప్రభుత్వం యూపీలో ఏర్పాటు అయిన తర్వాత ప్రజలందరికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ ను ఇస్తాం. అప్పుడు నేను వ్యాక్సిన్ ను తీసుకుంటాను అంటూ అఖిలేష్ యాదవ్ అన్నాడు. యూపీలో రాబోయేది తమ ప్రభుత్వం అని బీజేపీని ప్రజలు మళ్లీ నమ్మే పరిస్థితి లేదు అంటూ అఖిలేష్ యాదవ్ అన్నాడు. బీజేపీ కి కాలం చెల్లిందంటూ వ్యాఖ్యలు చేశాడు. రైతుల ఆత్మహత్యలను బీజేపీ పట్టించుకోవడం లేదంటూ కూడా అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.